
Munugodu By Election: టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన కమ్యూనిస్టు నాయకుడు..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కుల సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. మద్యం అయితే ఏరులై పారుతోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా మద్యం పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. కాగా మునుగోడులో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తోంది. ఇందులో భాగంగా చండూరులో సీపీఎం,సీపీఐ కలిసి టీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓ భూ నిర్వాసితుడు నిలదీశాడు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రసంగం ముగియగానే రాంరెడ్డి పల్లికి చెందిన జంగయ్య చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కాలించాలని డిమాండ్ చేశారు.
