వర్షం చెప్పిన వాస్తవం.!నిలువెత్తు నిర్లక్ష్యం.!ఆకాశమంత అవినీతి.!యాదాద్రి దయనీయ స్ధితి.!
యాదాద్రి/హైదరాబాద్ : మానవులు చేసిన తప్పిదాలను ప్రకృతి బయటపెడుతుందన్నట్టు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్మించిన యాదాద్రి దేవస్ధానంలో నిర్లక్ష్యం, అవినీతిని మంగళవారం అర్థరాత్రి కురిసిన వర్షం బహిర్గతం చేసింది. మంగళవారం కురిసిన వార్షానికి యాదాద్రి దేవస్ధానం కొండమీదకు వెళ్లాల్సిన రోడ్లు కుంగిపోవడం వల్ల కాంట్రాక్టర్ల అవినీతికి పాల్పడి నాసిరకం రోడ్లు వేసిన వైనాన్ని బహిర్గతం చేస్తోంది. ఒక్క రోడ్లే కాకుండా అనేక నిర్మాణాల్లో అధికారులు ఏమేరకు నిర్లక్ష్యం వహించారో, ఎంత మేరకు అవినీతి జరిగిందో మంగళవారం అర్థరాత్రి కురిసిన వర్షం బయటపెట్టింది.

యాదాద్రిలో నాసిరకం పనులు.. అన్నీ వైఫల్యాలే అంటున్న స్థానికులు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన యాదాద్రి దేవాలయ నిర్మాణంలో నిర్లక్ష్యం, అవినీతి చోటుచేసుకున్నట్టు తులుస్తోంది. దేవాలయానికి వచ్చే భక్తులకోసం కల్పించే మౌళిక సదుపాయాల నిర్మాణాల్లో అవినీతి చోటుచేకున్నట్టు తెలుస్తోంది. యాదాద్రి నిర్మాణం అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా జరిగినా నాణ్యతతో కూడిని పనులు జరిగాయని అందరూ భావించారు. కాని అక్కడి నిర్మాణాలు అందుకు విరుద్దంగా, ఏమాత్రం నాణ్యతలేకుండా జరిగినట్టు నిపుణులు నిర్దారించకుండా ప్రకృతి నిర్థారించింది.

చిత్తడిగా మారిన దేవస్థానం ప్రాంగణం.. అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు
యాదగిరిగుట్టలో బుదవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అకాల వర్షం కారణంగా యాదాద్రి పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. వర్షం ధాటికి నాసికరం పనులు ఏమాత్రం కొనసాగాయో బయటపడ్డాయి. ఆలయ కొత్త ఘాట్ రోడ్డు కూడా కుంగి కోతకు గురైందంటై నిర్మాణ పనులు ఎంత నాసిరకంగా చేపట్టారో అర్థమవుతోంది. అంతే కాకుండా ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు కూడా బుదవారం తెల్లవారు ఝామున కురిసిన వర్షానికి దారుణంగా మారిపోయింది.

కృంగిపోయిన రహదారి.. కాంట్రాక్లర్ నిర్లక్ష్యమంటున్న స్థానికులు
అంతే కాకుండా ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు చెరువును తలపిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. కొండపైకి ఎక్కే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో బస్సులతో పాటు ఇతర వాహనాలు దిగబడ్డాయి. ఈదురుగాలులకు కొండపైన భక్తులకోసం వేసిన చలువ పందిళ్ళు కుప్పకూలిపోయాయి. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరిపోయింది. దీంతో భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి.

చెరువును తలపించిన రింగ్ రోడ్.. అవినీతే కారణమంటున్న భక్తులు
చిన్నపాటి వర్షానికే యాదాద్రి దేవస్దానం ప్రాంగణం చిత్తడిగా మారడం, దేవాలయానికి వచ్చి వెళ్లే రోడ్డు చెరువును తలపించడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా కొత్తగా వేసిన ఘాట్ రోడ్డు కృంగిపోవడంతో నిర్మాణాలు ఎంత నాసిరకంగా నిర్వహించారో అర్థమవుతోందని దేవాలయానికి వస్తున్న భక్తులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం కోసం నిర్మించిన ఏ నిర్మాణంలో కూడా నాణ్యతలేదని భక్తులు చెప్పుకొస్తున్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందడంతో పాటు కాంట్రాక్టర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు తెలుస్తోందంటున్నారు భక్తులు.












Click it and Unblock the Notifications