హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం- సమరానికి సై..!!

కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అగ్రనాయకత్వం హైదరాబాద్ తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా ముహూర్తం ఎంపిక చేసింది.

కాంగ్రెస్ కీలక అడుగులు:తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. సెప్టెంబరు 16న హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే.

The first meeting of the newly formed Congress Working Committee will be held on September 16 in Hyderabad

సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని..ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ సీడబ్ల్యూసీ సమావేశ నిర్వహణపైన స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల సమరశంఖం:గత ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ వేదికగా విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సారి అదే రోజున కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ఎన్నికల సమర శంఖం పూరించనుంది. ప్రధాని జన్మదినం కూడా అదే రోజు కావటంతో ఈ నిర్ణయంపైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ 16 న హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది.

మరుసటి రోజున సెప్టెంబరు 17న సీడ్బ్ల్యూసీ సభ్యులతో పాటు , కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీ స్కీంలను ప్రకటించనున్నారు.

The first meeting of the newly formed Congress Working Committee will be held on September 16 in Hyderabad

ఎన్నిక మేనిఫెస్టో:ఈ సభ ద్వారా పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. ఇప్పటికే కేసీఆర్ తన పార్టీకి చెందిన 115 మంది అభ్యర్దులను ప్రకటించారు. కాంగ్రెస్ తమ అభ్యర్దుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేసింది. ఇక, నేరుగా హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం..బహిరంగలో పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటుంది.

ఆ సమయం నుంచే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ లతో ఇంటింటి ప్రచారం నిర్వహించేలా నిర్ణయించారు. దీంతో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ముందు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీసుకొనే నిర్ణయాలపైన దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+