జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం.!మే9 లోపు ఉద్యోగాల్లో చేరకపోతే తొలగింపే.!
హైదరాబాద్ : మే 9వ తేదీ, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ 9 మే, 2023 సాయంత్రం 5 గంటలలోపు తమ డ్యూటీలో చేరకపోతే, చేరని వారిని తొలగిస్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నోటీసు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులు జారీ చేసారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ప్రభుత్వంతో జేపీఎస్ లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. "జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను" అని సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ, jps లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు.
చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుండి సమ్మెకు వెళ్ళారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జెపిఎస్ లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు. అయితే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో జెపిఎస్ లకు చివరి అవకాశాన్ని ఇస్తుంది. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారని కూడా సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు.












Click it and Unblock the Notifications