SSC Exams: పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం..

గతంలో తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ కు 11 పేపర్లు ఉంటుండే. హిందీ ఒక్కటి ఒక పేపరు ఉంటుండగా.. మిగిలిన సబ్జెక్టులు రెండేసి పేపర్లు ఉంటుండే. అయితే గత రెండేళ్లలో తెలంగాణలో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల్లో మార్పు చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల సర్కారుకు ఎస్సీఈఆర్టీ అధికారులు పంపించారు. దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాసం ఉంది. రెండు సంవత్సరాల కిందట 11 పేపర్లతో టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో 2021- 2022 ఏడాదిలో ఆరు పేపర్లకు కుదిస్తూ అప్పటి సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2022 - 2023 విద్యాసంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

The government will take a crucial decision regarding the tenth class exams

కానీ ఫిజిక్స్, బయోలజీ క్వశ్చన్ పేపర్లను మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని తల్లిదండ్రులు, స్టూడెంట్ల నుంచి అధికారులకు విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే అధికారులు వేర్వేరు రోజుల్లో బయోలజీ, ఫిజిక్స్ పేపర్లు పెట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అయితే, ఎగ్జామ్ వేర్వేరు రోజుల్లో నిర్వహించినా మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థలకు టెన్షన్ తగ్గి, సైన్స్ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైమ్ దొరికే అవకాశం ఉంది.

ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహిణపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచే అధికారులు ఆరు సబ్జెక్టులకు చెందిన పేపర్లను ఏడు రోజుల పాటు నిర్వహించే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+