యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల వేళ మహాక్రతువు... విశేషాలివే!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలను జరుపుకోవడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ముస్తాబవుతోంది . మార్చి ఒకటవ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లను ప్రారంభించింది. యాదగిరిగుట్టలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల కోసం దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులు హాజరుకానున్నారు.

యాదగిరి గుట్టలో మహా క్రతువు
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటవ తేదీన స్వస్తివచనంతో ప్రారంభమవుతాయి. డోలోత్సవంతో ముగుస్తాయి. వానమామలై రామానుజ స్వామి చేతుల మీదుగా ఐదు రోజుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక ఈ క్రమంలో 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఒక మహాక్రతువును నిర్వహించునున్నారు. ఇప్పటికే ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనులు పూర్తికాగా, 108 మంది రుత్వికులతో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

The grand ceremony during the annual Brahmotsavam at Yadagirigutta this is the speciality

పుణ్య నదుల పవిత్ర జలాలతో మహా సంప్రోక్షణ
దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున శ్రీ సుదర్శన నరసింహ, శ్రీ లక్ష్మీ హవన హోమాలను నిర్వహించనున్నారు. 23వ తేదీన సుమారు లక్ష మందికి పులిహోర ప్రసాదాన్ని వితరణ చేసి యాదగిరిగుట్టలో బంగారు తాపడంతో చేసిన విమాన గోపురానికి సంబంధించి మహాక్రతువును పూర్తి చేయనున్నారు.

బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ ఇదే
ఇక ఈసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో బంగారు తాపడంతో చేసిన విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. మొత్తం 65.84 కిలోల బంగారాన్ని దీని కోసం వినియోగించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇక దేశంలోనే అతిపెద్ద విమాన గోపురం ఇదని ఈ గోపురాన్ని అయిదంతస్తుల పంచతల గోపురం అంటారని తెలిపారు .

వార్షిక బ్రహ్మోత్సవాల ముందు ప్రత్యేక కార్యక్రమం
50.5 అడుగుల ఎత్తులో ఇది ఉందని, దీనిలో 40 విగ్రహాలను ప్రతిష్టించారని, ప్రతి ఫ్లోర్లో ఎనిమిది విగ్రహాలు ఉంటాయని పేర్కొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల ముందు జరిగే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి నాలుగు మాడవీధులలో ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక మొత్తంగా వార్షిక బ్రహ్మోత్సవాల ముందు జరిగే మహాకుంభ సంప్రోక్షణ చాలా ప్రత్యేకమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+