స్థానిక సంస్థల ఎన్నికల పై హైకోర్టు కీలక తీర్పు, ఇక..!!
తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికల పైన హైకోర్టు తేల్చేసింది. కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. కొంత కాలంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. రిజర్వేషన్ల అంశం పైన చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో ఎన్నికల దిశగా కసరత్తు కొనసాగుతోందనే చర్చ సాగింది. కాగా, హైకోర్టు పంచాయితీ ఎన్నికల నిర్వహణకు గడువు ఖరారు చేస్తూ తుది తీర్పులో స్పష్టత ఇచ్చింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పైన హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. గత ఏడాది జనవరితోనే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అయినా, ఎన్నికలు నిర్వహించకపోవటం పైన కోర్టులో ఏకంగా ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. సర్పంచుల వ్యవస్థ లేక అభివృద్ధి వెనుకబడుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పిటీషన్ల పైన విచారణ చేసిన న్యాయస్థానం తుది తీర్పు చెప్పింది.

సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ఇటీవల ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తుది తీర్పు వెల్లడిస్తూ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. దీంతో.. బీసీలకు ఇచ్చిన హమీ మేరకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు చేయనున్నారు. రిజర్వేషన్లపై విధానం పై అధికారికంగా ప్రకటన చేేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications