మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన: నిందితుడు ఆత్మహత్య

బెంగళూరు/భువనేశ్వర్: బెంగళూరులో మహాలక్ష్మి(29) అనే మహిళను అతి కిరాతకంగా హత్య చేసి 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం కర్ణాటకతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల పోలీసు బృందాలు గాలిస్తున్న క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముక్తిరంజన్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నిందితుడు అరెస్టుకు భయపడి చెట్టుకు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

The incident where the woman was cut into pieces and kept in the fridge accused committed suicide

బెంగళూరులో జరిగిన ఘోరమైన నేరాన్ని ఒప్పుకుంటూ ముక్తిరంజన్ రాయ్.. సూసైడ్ నోట్ ని వదిలిపెట్టినట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం నిందితుడి మృతదేహాన్ని బెంగళూరు పోలీసులకు అప్పగించారు. మూడు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న బెంగళూరు పోలీసులకు తాము అవసరమైన సహాయాన్ని అందించామని భద్రక్ ఎస్పీ వరుణ్ గుంటుపల్లి తెలిపారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాధితురాలికి ఉన్న ముగ్గురు ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడైన ముక్తి రంజన్ రాయ్.. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూరులోని నెలమంగల సమీపంలో యువతిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో కుక్కాడు. కాగా, సడోమా సూకిస్ట్‌క్ అనే నేరస్వభావంతో నిందితుడు రగిలిపోయినట్లు వైద్య నిపుణులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్తిరంజన్ రాయ్.. ధుసూరి ప్రాంతంలో నివాసం ఉండేవాడు. బెంగళూరులోని ఒక బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. బెంగళూరు పోలీసులు రాయ్ కుటుంబ నేపథ్యం, అతని గ్రామం నుంచి ఇతర వివరాల గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

భర్తను వదిలి వచ్చిన బాధితురాలు.. నిందితుడితో సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే, మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నిందితుడు మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+