Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DS: ముగిసిన డీ శ్రీనివాస్ అంత్యక్రియలు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. నిజామాబాద్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డీఎస్ చిన్న కుమారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు డీఎస్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. డీఎస్ ను చివరిచూపు చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువుల భారీగా తరలివచ్చారు.

ఉదయం డీఎస్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహాన్న సందర్శించారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ లోనే ఎక్కువగా సాగింది. ఆయన 40 ఏళ్ల పాటు రాజకీయంలో కొనసాగారు. స్థానికంగా డీ శ్రీనివాస్ ను సీనన్న అని పిలుస్తుంటారు. డీఎస్.. నిజామాబాద్ జిల్లా వేల్పుూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 జన్మించారు.

The last rites of former PCC President Dharmapuri Srinivas were performed in Nizamabad

హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ , లా పూర్తి చేశారు. రిజర్వ్ బ్యాంకులో పనిచేశారు. ఆ టైమ్ లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు తో ఎన్ఎస్యూఐ లో చేరారు. డీఎస్ లోని నాయకత్వ లక్షణాలను గ్రహించిన ఇందిరాగాంధీ.. ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు.

ఆ తర్వాత డీఎస్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు పీసీసీ పదవి చేపట్టారు. డీఎస్ హైదరాబాద్ లో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+