Weather Report: చలితో వణికిపోతున్న తెలంగాణ.. ఉమ్మడి ఆదిలాబాద్‍లో అత్యల్ప ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం 7, ఉదయం 9 వరకు చలి గాలులతో వణికిస్తోంది.జనవరి 11 వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. ముఖ్యంగా సోమ, మంగళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు అవకాశముందని తెలిపింది.

ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ

ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో మధ్యాహ్నం పొడిగా, రాత్రి చలిగా ఉంటుందని పేర్కొంది. రాత్రిపూట సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి సహా మరో 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలిపింది.

సిర్పూరు

సిర్పూరు

ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 4.7, కోహిర్ 4.6, నల్లవల్లి 5.7, న్యాల్కల్‌ 5.9 ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

ఏపీలోనూ

ఏపీలోనూ

దేశ వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం.. ముఖ్యంగా ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలి పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉదయం, రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. ఏపీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆ రాష్ట్రంలోనే అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

నుములూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరు 9, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణిలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు స్వెటర్లను ధరించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+