Weather Update: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు..!
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్ర రాజధానితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఆదివారం పలు జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
సెప్టెంబర్ 7, 8 తేదీలకు సంబంధించి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచా వేసింది. ఆదివారం మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమ, మంగళవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపీడనం సోమవారం వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కాగా శుక్రవారం సాయంత్రం, రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జంట జలశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద కొనసాగుతోంది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని తెలిపింది. అల్పపీడనం వాయుగుండగా మారి ఉత్తరాంధ్ర లేదా ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications