వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులను ప్రేమిస్తే ఏమౌతుంది,మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు.!రైతు గుండెల్లో ప్రేమ గింజలు నాటిన మంత్రి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్బంగా వ్యవసాయ మంత్రి ప్రేమ పాఠాలు వల్లెవేసారు. రైతులను ప్రేమిస్తే పోయేదేముంది.?మహా ఐతే తిరిగి ప్రేమిస్తారని హీరో ప్రభాస్ డైలాగ్ వినిపించారు. మరో అడుగు ముందుకేసి రైతుల మమకారపు పొలాల్లో అనురాగపు ప్రేమగింజలు నాటితే తప్పేంటని ప్రశ్నించారు. అన్నదాతలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, రైతులు సంతోషంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రమపద్దతిలో వ్యవసాయ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

రైతులను ఎంతప్రేమిస్తే అంత మంచిది.. వ్యవసాయ మంత్రి యాసంగి ప్రేమ.

రైతులను ఎంతప్రేమిస్తే అంత మంచిది.. వ్యవసాయ మంత్రి యాసంగి ప్రేమ.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో సాగునీటి వసతి కల్పనకు నిరంతరం పనిచేస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. మట్టిమనుషులను, రైతులను ఎంత ప్రేమిస్తే అంతమంచిదని అన్నారు. మనమంతా వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్లమేనని, ఎవరమూ మన మూలాలను మరవొద్దని హితవుపలికారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేసారు. అన్నిరంగాల అధికారులు తమ తమ విధులను సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

సస్యశ్యామలంగా పల్లెలు.. కేసీఆర్ కష్టానికి నిదర్శనాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి..

సస్యశ్యామలంగా పల్లెలు.. కేసీఆర్ కష్టానికి నిదర్శనాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి..

గ్రామ సీమలు గతంలో కరువుకు నిలయంగా, అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉండేవని, ఇప్పుడు అవే గ్రామీణ ప్రాంతాలు పూర్తి మౌళిక సదుపాయాలతోపరిశుభ్రంగా అలరారుతున్నాయని, ప్రజలంతా ఎక్కడికక్కడ అన్ని వసతులతో సంతోషంగా జీవించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. పల్లెలు విడిచి ప్రజలు పట్టణాలకు వలస పోవడంతోహైదరాబాద్ వంటి నగరంలోఎన్ని రోడ్లు వేిసినా, ఎన్ని వసతులు కల్పించినాసరిపోవడం లేదు. పల్లెలను విడిచి పట్టణాలకు వలసలు నాగరిక సమాజానికి మంచిది కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

వలసలు తగ్గాయి.. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారన్న వ్యవసాయ మంత్రి..

వలసలు తగ్గాయి.. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారన్న వ్యవసాయ మంత్రి..

తెలంగాణలో వలసలు గణనీయంగా తగ్గిపోయాయని, ఇది ఎంతో ఆనందదాయక పరిణామమని మంత్రి తెలిపారు. గతంలో పండగలుఎన్నో ఇబ్బందులతో నిర్వహించుకునే వారని, ఇప్పడు ఆ పరిస్థితి తప్పిపోయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు అడుగుపెడుతుండగానేముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్కు పాలన కనిపిస్తుందని, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నూతన రహదారులు, మౌళిక సదుపాయాలతోదర్శనమిస్తున్నాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితోపనిచేస్తేవారు ఆదరిస్తారని మంత్రి గుర్తు చేసారు.

రైతులతో పాటు ప్రజానికానికి పండుగ శుభాకాంక్షలు.. క్రిష్ణా జలాలకుపూలు చల్లి పూజలు చేసిన మంత్రి

రైతులతో పాటు ప్రజానికానికి పండుగ శుభాకాంక్షలు.. క్రిష్ణా జలాలకుపూలు చల్లి పూజలు చేసిన మంత్రి

రైతులు, ప్రజలు, పార్టీ నేతలు, అభిమానులు, ఉద్యోగులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు, ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ప్రజా ప్రతినిధులు అందరికీ భోగి, సంక్రాంతి పండగశుభాకాంక్షలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు. గోపాల్ పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజెమొదటి కాలువలనుపరిశీలించి క్రిష్ణా జలాలకుపూలు చల్లి పూజలు చేసారు నిరంజన్ రెడ్డి. ఏదుట్ల కు చెందిన ఇందిరమ్మ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరయిన 3 లక్షల రూపాయల ఎల్ఓసీని మంత్రి అందజేసారు.

English summary
State Agriculture Minister Singireddy Niranjan Reddy said that the society would be better off if the donors were happy and the Telangana government was working in good faith for systematic agricultural development to keep the farmers happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X