Power Cuts: విద్యుత్ కోతలపై గొంతెత్తిన ప్రతిపక్షాలు..
విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి.
రాష్ట్రంలో కరెంట్ కోతలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరెంటు కోతలు విధించడం మానుకోవాలంటూ నినాదాలు చేశారు.

స్పీకర్ పట్టించుకోవడం లేదు
రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని.. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇదే విషయంపై చర్చ కోసం గొంతు పోయేలా అరిచినా స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు.
సీతక్క
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో రూ. 16 వేల కోట్ల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. పంటలు పండే సమయంలో కరెంట్ కట్ చేస్తున్నారని సీతక్క విమర్శించారు. నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ షర్మిల
24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. చాలా చోట్ల రైతులు కరెంటు కోసం ధర్నా చేస్తున్నారని షర్మిల గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలన తీరును తలపిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications