వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినతిపత్రాల కార్యక్రమం విజయవంతం.!రైతులకు అండగా ఉండేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్న రేవంత్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. కల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో రైతులు పడుతున్న గోస వర్ణనాతీతమని కాంగ్రెస్ నాయకులు అభివర్ణిస్తున్నారు. కల్లాల్లో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందించింది. రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యాన్ని కొనకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారని, అందుకోసం జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు రైతులు పడుతున్న కష్టాలను వివరిస్తూ వినతిపత్రాలను సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ.

 దయనీయ పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం.. కాంగ్రెస్ అండగా ఉంటుందన్ని రేవంత్

దయనీయ పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం.. కాంగ్రెస్ అండగా ఉంటుందన్ని రేవంత్

గురువారం టీపీసీసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యల పై జిల్లా కేంద్రలలో డీసీసీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ కార్యక్రమానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని, వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు ఇచ్చే కార్క్రమాన్ని నిర్వమిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

 ఢిల్లీ యాత్రలవల్ల ప్రయోజనం సున్నా.. కేసీఆర్ రైతులను మభ్యపెడుతున్నారన్న పీసిసి ఛీఫ్

ఢిల్లీ యాత్రలవల్ల ప్రయోజనం సున్నా.. కేసీఆర్ రైతులను మభ్యపెడుతున్నారన్న పీసిసి ఛీఫ్

రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం నాడు వి.హెచ్ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ మధుసూధన్ నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు, ఐ.ఎన్.టి.యు.సి నేత జనక్ ప్రసాద్, పిసిసి కార్యదర్శి అఫ్సర్ యూసఫ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని కొనాల్సిందే.. కలెక్టర్లకు వినతి పత్రాలిచ్చిన నేతలు..

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని కొనాల్సిందే.. కలెక్టర్లకు వినతి పత్రాలిచ్చిన నేతలు..

గురువారం రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని మద్దతు ధర కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సంగినేని సుధీర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్వ సుజాత మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ చల్ల కవితా బాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ సుభాష్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.

 చివరిగింజ కొనేంతవరకు పోరాటం ఆగదు.. కేసీఆర్ పై ఒత్తిడి తెస్తామన్న రేవంత్ రెడ్డి

చివరిగింజ కొనేంతవరకు పోరాటం ఆగదు.. కేసీఆర్ పై ఒత్తిడి తెస్తామన్న రేవంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు పై కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద వరి దీక్షలతో పాటు,
గతంలో కాంగ్రెస్ చేపట్టిన ధాన్యం కొనుగోలు పోరాటాలు, ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు బృందాల పర్యటన చేపట్టాలని టీపిసిసి నిర్ణయించింది. రాష్ట్రంలో రైతు పరిస్ధితి అద్వాన్నంగా తయారయ్యిందని, రైతు కష్టాలను తీర్చే నాథుడు లేడని, సమస్యలు పరిష్కరించాల్సిన చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కేంద్రంపైన నెపం మోపి చేతులు కట్టుకుని కూర్చుందని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. అందుకే రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడాలని రేవంత్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.

English summary
The Congress party has formulated a campaign on the issue of grain procurement.The Congress party has embarked on a program of submitting petitions to collectors across the districts outlining the hardships they are facing, saying that farmers will lose out completely if they do not buy dried grain on the roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X