Cyber Crime: ప్రజాపాలనకు దరఖాస్తు చేశారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. మిస్ అయితే అంతే..!
రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు భారీగా వచ్చాయి. అధికారులు ఇప్పుడు వీటిని ప్రాసెస్ చేస్తున్నారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని కోరారు.ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్, ఇ-మెయిల్స్ ద్వారా ఓటీపీని షేర్ చేయడం ద్వారా చాలామంది మోసపోతున్నారని పోలీసులు తెలిపారు.
ఆరు గ్యారెంటీలు అప్లై చేసిన వారికి సైబర్ క్రైమ్ పోలీసులు పలు సూచనలు చేశారు. గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. ప్రజలంతా మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే.. చెప్పొద్దని స్పష్టం చేశారు. సీజన్ ను బట్టి సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దరఖాసుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి OTP లు రావు కాబట్టి.. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.

తెలంగాణలో తాజాగా అమలు అవుతున్న ట్రాఫిక్ చలాన్ల రాయితీకి సంబంధించి కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూల్ కు రాయితీ ప్రకటించింది. ఆటో, టూ వీలర్లకు 80 శాతం రాయితీ.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికిల్స్ కు 60 శాథం రాయితీ ప్రకటించారు. ఈ రాయితీ గత డిసెంబర్ 26 నుంచి జనవరి 10 ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు చెల్లింపులు చేస్తున్నారు.
ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై కూడా పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్లు చెల్లించాలని కోరారు.












Click it and Unblock the Notifications