• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముచ్చట తీర్చనున్న మునుగోడు.!రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న ఫలితం.!సూపర్ సండే ఎవరిది.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఒక ఉప ఎన్నిక.. వంద సమీక్షా సమావేశాలు.. వెయ్యి వరాలు..లక్ష వాగ్దానాలు.. ఊహించని తాయిలాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారనే భరోసా.. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా రాజకీయ పార్టీ నేతల విన్యాసాలు, హామీలు, మునుగోడు ప్రజల మీద చూపించిన ప్రేమాభిమానాలు తారా స్థాయిలో రక్తికట్టాయన్న గుసగుసలు మునుగోడు నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో వినిపిస్తున్నాయి. తెల్లని దుస్తుల్లో వచ్చిన నేతలు చెప్పిన చల్లటి ముచ్చట్లకు మునుగోడు ప్రజానికం ఎంతవరకు ప్రభావితం అయ్యారనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెల్లటి దుస్తుల్లో చల్లటి వాగ్ధానాలు.. మునుగోడు ప్రజలు నమ్మారా.?

తెల్లటి దుస్తుల్లో చల్లటి వాగ్ధానాలు.. మునుగోడు ప్రజలు నమ్మారా.?

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే ప్రకటన ఎంత ప్రాచూర్యం పొందిందో ఒక ఉప ఎన్నిక వరాల ఝల్లు కురిపిస్తుందనే ఆశాభావాన్ని ఆ నియోజకవర్గ ప్రజానికం వ్యక్తం చేయడం సర్వ సాధారణంగా మారింది. గతంలో జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికలు ఆయా నియోజకవర్గ ప్రాజానికానికి ఊహించని ఆశలను చిగురించజేసాయి. అదే కోణంలో ఉప ఎన్నిక వచ్చిందంటే ఆయా నియోజకవర్గ ప్రజలు రాజలకీయ నేతలు ప్రకటించే వరాలను ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తుండడం అలవాటుగా మారిపోయింది.

మూడు వారాల్లో ముప్పై వాగ్ధానాలు.. మునుగోడులో వరాల ఝల్లు కురించిన నేతలు

మూడు వారాల్లో ముప్పై వాగ్ధానాలు.. మునుగోడులో వరాల ఝల్లు కురించిన నేతలు

మునుగోడు నియోజక వర్గంలో కూడా అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనే అంశాన్ని పక్కన పెడితే ఉప ఎన్నిక ద్వారా ఎంతవరకు లబ్ది పొందుతామనే దిశాగా ఆలోచిస్తున్నారు ప్రజలు. దీంతో పెద్ద ఎత్తుల ఆశలు పెట్టుకుని రాజకీయ నాయకుల వాగ్దానాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో కీలక అంశం ఏంటంటే తమకు ఇష్టమైన పార్టీ నుండి వరాలు పొందినప్పటికి ఇతర పార్టీల నేతల నుండి కూడా అంతే స్ధాయిలో వరాలు కావాలని కోరుకోవడం కూడా ఆయా నియోజక వర్గాల్లో సర్వ సాధారణంగా మారిపోయింది.

పండగను తలపిస్తున్న ఉప ఎన్నిక.. ఆశల పల్లకిలో ప్రజలు

పండగను తలపిస్తున్న ఉప ఎన్నిక.. ఆశల పల్లకిలో ప్రజలు

మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇదే జరిగిందనే చర్చ నెలకొంది. మునుగోడు ప్రజానికానికి తారా స్థాయింలో అండదండలు అందించినప్పటికి, గట్టి ఆర్థిక సాయం అందించినప్పటికి గెలుస్తామనే భరోసా పూర్తి స్ధాయిలో వ్యక్తం చేయలేక పోతున్నారు ప్రస్తుత నాయకులు. అదికార గులాబీ పార్టీ, మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపి, సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి ఆ స్దానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్.. పోటా పోటీగా మునుగోడులో ప్రచారం నిర్వహించాయి. అంతే కాకుండా సంక్షేమం, అభివృద్దికి సంబందించిన వాగ్దానాలు కూడా శృతిమించాయనే చర్చ కూడా చోటుచేసుకుంది.

కోట్లలో ఖర్చు.. ఐనా కానరాని భరోసా..? రాబోయే సూపర్ సండే ఏ పార్టీది..?

కోట్లలో ఖర్చు.. ఐనా కానరాని భరోసా..? రాబోయే సూపర్ సండే ఏ పార్టీది..?

ఇంత జరిగినా, ప్రధాన పార్టీ నేతలు ఇన్ని వరాలు కురిపించినా కూడా గెలుపుపై ధీమాను మాత్రం వ్యక్తం చేయలేకపోతున్నారు. కార్యకర్తల మనోస్తైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు మేకపోతు గాంభీర్యంతో గెలుపు తమదే అని చెప్పుకొస్తున్నప్పటికీ లోలోపల మాత్రం మదనపడిపోతున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు కుమ్మరించినప్పటికి మునుగోడు ప్రజలు పోలింగ్ కేంద్రంలో ఎవరికి అనుకూలంగా వ్యవహరించారో పసిగట్టలేక సంకట స్దితిలో ముఖ్యనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీకి మునుగోడు ప్రజానికం సై అన్నారో, ఏ పార్టీ నేతలను విశ్వసించారో, రాబోయే ఆదివారం ఏ పార్టీకి సూపర్ సండే కానుందో తెలియాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే..!

English summary
People are thinking about how much they will benefit from the by-election. It seems that they are waiting for the promises of politicians with high hopes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X