CM KCR: తెలంగాణలో మరో కేబుల్ బ్రిడ్జి.. ఎక్కడంటే..!
తెలంగాణలో మరో కేబుల్ బ్రిడ్జి రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ఉండగా, కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. మరో కేబుల్ బ్రిడ్జిని ఖమ్మం జిల్లాలో నిర్మించనున్నారు. బుధువారం ఖమ్మంలో బహిరంగ సభలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖమ్మంపై వరాలు జల్లు కురింపించారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం ఖమ్మం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున విడుదల చేయనున్నారు.

పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు నిన్న కేసీఆర్ చెప్పారు.ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వివరించారు.
మంత్రి అజయ్ వినతి మేరకు మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఖమ్మం జిల్లాలో నిర్మించబోయే కేబుల్ బ్రిడ్జిని మునేరు నదిపై నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications