హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ డాక్టర్ కథ ..తన జీవితంలో మూడేళ్ళు మాయం .. అసలేం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

రీల్ లైఫ్ లో గతాన్ని మర్చిపోవటం, మళ్ళీ ఎప్పుడో తిరిగి గుర్తుకు రావటం వంటి సీన్లు బోలెడు చూసి వుంటాం . కానీ రియల్ లైఫ్ లో అలాంటి సంఘటనలు చాలా అరుదు . హైదరాబాద్ లోని ఒక లేడీ డాక్టర్ జీవితంలో ఏకంగా మూడేళ్ళు ఏం జరిగిందో మర్చిపోయింది. ఇప్పుడు ఆమెకు గతం గుర్తొచ్చింది. తానొక డాక్టర్ నని చెప్తుంది . ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు . సినీ స్టోరీలోని ట్విస్ట్ లా సాగిన ఓ డాక్టర్ కథే ఈ కథనం .

<strong>స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటే</strong>స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటే

డాక్టర్ మతిస్థిమితం కోల్పోవటంతో ౩ ఏళ్ళ విలువైన జీవితం మిస్

డాక్టర్ మతిస్థిమితం కోల్పోవటంతో ౩ ఏళ్ళ విలువైన జీవితం మిస్

సినిమాను తలపించేలా ఉన్న ఈ ఉదంతంలో అసలు విషయానికి వస్తే మెడిసిన్ చేయాలన్న లక్ష్యంతో యూపీలోని వారణాసికి చెందిన ఒక యువతి సునందా సాహి హైదరాబాద్ కు వచ్చింది. మొయినాబాద్ లోని వీఆర్కే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తర్వాత ఏడాది పాటు ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసింది. తర్వాత ఏమైందో తెలీదు కానీ సునందా సాహీ మతిస్థిమితం కోల్పోయారు. ఆమె ఎవరో తెలీని పరిస్థితిలో అనుమానస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారు. దీంతో.. ఆమెను తీసుకొచ్చి కస్తూర్బా అనాథాశ్రమంలో చేర్పించారు.

సడన్ గా గతం గుర్తొచ్చిన డాక్టర్ .. తను డాక్టర్ సునందా సాహి అని వెల్లడి

సడన్ గా గతం గుర్తొచ్చిన డాక్టర్ .. తను డాక్టర్ సునందా సాహి అని వెల్లడి

గడిచిన 18 నెలలుగా చికిత్స పొందుతున్న సునందా సాహికి తన గతం జ్ఞప్తికి వచ్చింది. అప్పటివరకూ వైద్యం చేయించుకుంటున్న ఆమె డాక్టర్ అన్న విషయాన్ని సునంద చెప్పారు. ఆమె మాటలు విన్న వారికి నమ్మకం కలగలేదు. తన పేరు..ఊరు.. తన నేపథ్యాన్ని ఆమె చెప్పటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సూచనతో ఆమె వివరాల్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. మూడేళ్ళుగా సునందా సాహి ఏమైందో తెలీని స్థితిలో ఉన్న వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు వచ్చారు.

మూడేళ్ళలో తండ్రి మరణం , తల్లి అనారోగ్యం ... ఇంతకీ సునంద ఎందుకు అలా అయ్యింది అన్నదే ప్రశ్న ?

మూడేళ్ళలో తండ్రి మరణం , తల్లి అనారోగ్యం ... ఇంతకీ సునంద ఎందుకు అలా అయ్యింది అన్నదే ప్రశ్న ?

ఈ మూడేళ్ళ వ్యవధిలో ఆమె తండ్రి మరణించారు. తల్లి అస్వస్థతో కదల్లేని పరిస్థితికి చేరుకుంది . ఆమె బంధువులు హైదరాబాద్ కు వచ్చి.. సునందను పలుకరించారు.. పరామర్శించారు. ఆమె ఆచూకీ తెలియటం , ఆమె మామూలు మనిషి కావటం బాగానే ఉన్నా .. ఆమె జీవితంలో విలువైన మూడేళ్ళ కాలం ఎలా మిస్ అయ్యింది ? అసలు సునందా సాహి అలా మారటానికి కారణం ఏమిటి ? ఆమె మానసిక పరిస్థితి ఎందుకు మారిందన్నది ఇప్పుడు ప్రశ్న.

English summary
In movies some of the scenes forget the past and recollect it once again in reel life . But such events are rare in real life. A lady doctor in Hyderabad forgot about what happened three years ago. Now she's recollected her past. she is a doctor. It's amazing to believe that it's true story . Sunanda sahu lost his three years of life because of her mental sickness . Now she is normal and she is recollecting that what happened to her .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X