Mid manair: మిడ్ మానేరు నిర్వాసితులకు శుభవార్త..4696 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు..

మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే.. కొందరి త్యాగాల ఫలితమే.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వారి త్యాగాల వల్ల మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాగే ప్రాజెక్టులు నిర్మించాలంటే.. ఎంతో మంది తమ భూమిని, ఇళ్లను త్యాగం చేస్తారు. ప్రాజెక్టు పూర్తి అయితే కోట్లాది మంది సంతోషంగా ఉంటారు. కానీ ప్రాజెక్టు కోసం ఉన్న ఊరిని వదిలేసిన దిక్కులేని పక్షుల్లా మారిన నిర్వాసితుల గురించి ఎవరు ఆలోచించారు.

చాలా మంది వారికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని భావిస్తారు. కానీ వారి భూమికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు చాలా తక్కువ. అయినప్పటికీ వారు త్యాగం చేశారు. కానీ వారికి ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదు. నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చారు. చివరికి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.మిడ్ మానేరు నిర్వాసితుల ఎళ్లతరబడి ఎదురుచూపులకు రేవంత్ రెడ్డి సర్కారు తెర దించింది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ సమయంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం పడిగాపులు కాస్తున్న నిర్వాసితులకు ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

The Telangana government has allotted Indiramma houses to the displaced people of Mid Manair

మొత్తం 12 గ్రామాలలోని నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. దీంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయిన్‌‌పల్లి మండలం మాన్వాడ దగ్గర 25.6 టీఎంసీల సామర్థ్యంతో 2.32లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2006లో మిడ్ మానేర్ ​ప్రాజెక్ట్ నిర్మాణం​ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు 2019లో పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు వల్ల 12 గ్రామాలు సర్వస్వం కోల్పోయాయి. దాదాపు 11,731 కుటుంబాలకు నిర్వాసితులుగా మారాయి.

వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరకోర పరిహారం చెల్లించింది. ఆర్‌‌‌‌అండ్ఆర్ ​కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. అయితే స్థలాల్లో సొంత డబ్బుతోనే ఇండ్లు నిర్మించుకోవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం వ్యతిరేకత రావడంతో 2015లో కేసీఆర్ వారికి రూ.5.04 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాట తప్పారు. 2016లో మిడ్ కట్ట తెగినప్పుడు అక్కడి వచ్చిన కేసీఆర్ 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అప్పుడు 4 వేల మందిని అర్హులుగా తేల్చగా.. కేవలం 2 వేల మందికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పోరాటం చేసింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించి నిర్వాసితులకు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+