TS EAMCET: ఎంసెట్‍కు సంబంధించి కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం..
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)లో విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ర్యాంకులు కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌కు 25 శాతం వెయిటేజీని రద్దు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన జీఓ ఎంఎస్ 73ని సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం జీఓ ఎంఎస్ నెం.18ని జారీ చేసింది. EAMCETలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మెరిట్ క్రమంలో ర్యాంక్ ఇవ్వనున్నారు. గత రెండేళ్లలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది. ఇప్పుడు పూర్తిగా తొలగించింది.
గతేడాది వరకూ 70% సిలబస్‌ను అమలు చేశారు. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేకుండానే ఎంసెట్ ర్యాంకులు ఇచ్చారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉండడంతో విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేసింది. జేఈఈ మెయిన్, నీట్‌లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తివేశారు. ఎంసెట్ పరీక్షవు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు.













Click it and Unblock the Notifications