• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఉద్యమం కూడా ఇంత దారుణంగా జరగలేదు..! ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన నేతలు..!!

|

హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల సమ్మె ఉగ్ర రూపం దాలుస్తోంది. ఎంత ఉగ్ర రూపం దాలుస్తోందో అంతే స్థాయిలో రాజకీయ జోక్యం కూడా పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం, ఆర్టీసి జేఏసి నేత అశ్వద్దామ రెడ్డి, ఓయూ జేఏసి నేతలు ఆర్టీసి సమ్మెకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. సామరస్య వాతావరణంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పరిస్థితి పూర్తిగా చేజారిపోతే ప్రభుత్వానికే నష్టమని సూచిస్తున్నారు. ఆర్టీసి ఉద్యోగులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని హితవుపలుకుతున్నారు.

 బంద్ కు పవన్ కళ్యాణ్ పచ్చజెండా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్న గబ్బర్ సింగ్..

బంద్ కు పవన్ కళ్యాణ్ పచ్చజెండా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్న గబ్బర్ సింగ్..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జెఏసి ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని, కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమన్నారు. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదన్నారు. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందని గబ్బర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చించాలని, సమ్మె జఠిలం కాకుండా పరిష్కరించాలని ప్రభత్వ వర్గాలకు పవన్ కళ్యాణ్ సూచించారు.

 విధుల్లోకి రాక పోతే ఉద్యోగాల నుండి తొలగించారు..

విధుల్లోకి రాక పోతే ఉద్యోగాల నుండి తొలగించారు..

సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ ను ఏంచేయాలన్న రేవంత్..

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు చంద్రశేఖర్ రావు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానన్న చంద్రశేఖర్ రావు మాట తప్పారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రులు తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రెండు రోజులు డ్యూటీకీ రాకపోతేనే జాబ్ పోతుందని చంద్రశేఖర్ రావు అంటున్నారని, మరి సచివాలయానికి రాని చంద్రశేఖర్ రావును ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి ఖర్చులను కూడా ప్రభుత్వం భరించలేదన్నారు. జీతం రాక ఆర్టీసీ కార్మికుడు సురేందర్ గౌడ్ హౌసింగ్‌లోన్ చెక్ బౌన్స్ అయ్యిందన్నారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ 2500 కోట్ల రూపాయలను చంద్రశేఖర్ రావు దోచుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

 మండిపడ్డ కోదండరాం..

మండిపడ్డ కోదండరాం..

మన ఓట్లకు పుట్టినోడు కేసీఆర్.. మండిపడ్డ కోదండరాం..

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. 'మన ఓట్లకు పుట్టినోడు.. మనల్ని మనుషులం కాదంటే ఒప్పుకుంటామా...? ఆర్టీసీ మనదే.. గెలుపు మనదే' అంటూ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఖర్చులకు ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉందా అంటున్న సీఎం చంద్రశేఖర్ రావు, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తెలంగాణ ప్రజలు కూడా పడాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ అహంకారాన్ని వీడాలనన్న అశ్వత్థామరెడ్డి..

కేసీఆర్ అహంకారాన్ని వీడాలనన్న అశ్వత్థామరెడ్డి..

ఇంతటి దుర్మార్గం ఎన్నడూ చూడలేదు.. కేసీఆర్ అహంకారాన్ని వీడాలనన్న అశ్వత్థామరెడ్డి..

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో సమస్యపై వినతిని గవర్నర్ కు అందజేసినట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థమారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ, కార్మికులను రెచ్చకొడుతున్నారన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్చలేదని, రాష్ట్రంలో జరుగుతున్న దహణకాండ పై గవర్నర్ కి వివరించామన్నారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పాలకాలన్నారు. కారం రవీందర్ మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదని అశ్వద్దామ రెడ్డి తెలిపారు.

English summary
The strike of the RTC workers is in the form of terror. The degree of political intervention is also increasing as a matter of terror. Congress Party working President Revanth Reddy, Janasena supremo Pawan Kalyan, Telangana Jana Samithi chairman Kodanda RAM, RTC JAC leader Ashaddama Reddy and OU JAC leaders are not only declaring solidarity with the RTC strike but criticising government policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X