ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిన్నారం అడవుల్లో ఏలియన్స్: దాని వెనక కథ ఇదీ....

ఆదిలాబాద్ జిల్లా జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయంటూ వాట్సప్, సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయంటూ వాట్సప్, సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అవి గొర్రెలను చంపుకుని తిన్నాయని, అక్కడి సిసి కెమెరాలకు ఆ దృశ్యాలు చిక్కాయని ప్రచారం సాగుతూ వచ్చింది.

అడవిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు అందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాయని కొంత మంది వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు.

<strong>జిన్నారం అడవుల్లో ఏలియన్స్, గొర్రెల్ని చంపి తిన్నాయని, సిసిటీవీ ఫుటేజీలంటూ?(ఫోటోలు)</strong>జిన్నారం అడవుల్లో ఏలియన్స్, గొర్రెల్ని చంపి తిన్నాయని, సిసిటీవీ ఫుటేజీలంటూ?(ఫోటోలు)

ఫొటోల్లో చూస్తే అదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలి వేళ్లు ఉన్నాయని, గ్రహాంతరవాసులలను పోలిన వ్యక్తులుగా ఉన్నారని కూడా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం వెనక పెద్ద మతలబే ఉందని అంటున్నారు.

వైల్డ్ గేమ్ అని ఉంటుంది....

వైల్డ్ గేమ్ అని ఉంటుంది....

ప్రచారంలో పెట్టిన ఓ ఫొటోలో కింద wildgame అని ఉంటుంది. ఆ సైటులోకి వెళ్తే పిల్లల వినోదపరైన కెమెరాలు, గేమ్ కెమెరాలు, రాత్రిపూ అడవుల్లోని దృశ్యాలను చిత్రీరించే ట్రయల్ కెమెరాలు దొరుకుతాయి. Pintrest వటి ఫొటోల సైట్లలోకి వెళ్లినా అవి దొరుకుతాయన అంటున్నారు. వాస్తవానికి కొన్ని ట్రయల్ కెమెరాల కంపెనీలు ఆ బొమ్మలను త ప్రకటనలకు వాడుకుంటున్నాయని అంటున్నారు.

గతంలో అక్కడ కూడా....

గతంలో అక్కడ కూడా....

గతంలో అవే ఫొటోలతో భువనేశ్వర్ సమీపంలోని నెయిలీ అడవుల్లో అవి కనిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం రిగింది. 2010 నుంచి ఇలాంటి ఫొటోలు ఇలా ప్రతి దేశంలోనూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని అంటున్నారు. తప్పుడు మెసేజ్‌లు, వీడియోలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆ వింత జీవి....

ఆ వింత జీవి....

సోషల్ మీడియాలోనూ వాట్సప్‌లోనూ హల్‌చల్ చేస్తున్న వింత జీవి ఓ కాల్పనిక పాత్ర అని తెలుస్తోంది. 2006లో గోట్‌మ్యాన్‌లో ఆ కాల్పనిక పాత్రను ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. దాన్ని ఈ ప్రచారానికి వాడుకుని ఉంటారని భావిస్తున్నారు.

అవన్నీ అబద్ధం

అవన్నీ అబద్ధం

ఈ ఫోటోలు అన్ని కూడా నిజమైనవి కావని చాలామంది ఇప్పటికే కొట్టిపారేస్తున్నారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఎక్కడా ఆధారాలు లభించలేదని కూడా చెబుతున్నారు.

English summary
It is said that the Aliens in Jinnaram forests of Adilabad district in Telangana state is farce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X