CM Revanth Reddy: గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.. అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి.. రేవంత్ ఎమోషనల్ పోస్ట్..!
సీఎం రేవంత్ రెడ్డికి ఈ దసరా మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా తన సొంత ఊరిలో దసరా పండుగ జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సీఎం స్వగ్రామం వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లి. దీంతో ఆయన తన ఊరి ప్రజలు, బంధువులు, స్నేహితుల మధ్య దసరా వేడుకలు చేసుకున్నారు. ఊరి ప్రజలతో రేవంత్ రెడ్డి సరదాగా గడిపారు. గ్రామస్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో బ్యాగ్ రౌండ్ లో మెగా హీరో రామ్ చరణ గేమ్ ఛేందర్ సినిమాలోని రా మచ్చ రా మచ్చ అనే పాటకు జత చేశారు. ఈ వీడియోను రామ్ చరణ్ అభిమానులు కూడా తెగ షేరు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వీడియోతో పాటు కొన్ని ఎమోషనల్ వ్యాఖ్యలు కూడా జత చేశారు. "గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.. అనుబంధాలు ... శాశ్వతమై మిగిలాయి.. కొండారెడ్డిపల్లిలో... ఈ దసరా నా జీవన ప్రస్థానంలో... ఆత్మీయ అధ్యాయం" అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోకు ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో తీయడానికి డ్రోన్ కెమెరా కూడా వాడారు. రేవంత్ రెడ్డి పూల వర్షం కురిపించడం వీడియోలో చూడవచ్చు. రేవంత్ ను చూడాడానికి సొంతూరు వాళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు కూడా ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాడు. రేవంత్ రెడ్డి మనవడిని భుజాలపై ఎక్కించుకుని తిరిగాడు.
గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.
— Revanth Reddy (@revanth_anumula) October 13, 2024
అనుబంధాలు …
శాశ్వతమై మిగిలాయి.
కొండారెడ్డిపల్లిలో…
ఈ దసరా నా జీవన ప్రస్థానంలో…
ఆత్మీయ అధ్యాయం.#Dussehra #Dussehra2024 pic.twitter.com/1lPABSpZVq












Click it and Unblock the Notifications