Water: ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరెజీకి చేరిన నీటి మట్టాలు..
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నాలుగేళ్ల కనిష్టానికి చేరుకుంది. దీంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఏప్రిల్ లో ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటి మట్టం ఉండాలి. కానీ ప్రస్తుతం జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 10 టీఎంసీలకు తగ్గింది. దీంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 90.313 ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 10.686 టీఎంసీల నీరు ఉంది. ఇందులోంచి 3 టీఎంసీలు ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం వాడాలి. 2.5 నుంచి 3 టీఎంసీల నీరు ఆవిరయ్యే అవకాశం ఉంది. ఎండలు తీవ్రంగా ఉంటే ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఇటు ఎస్సారెస్పీ కింద ఉన్న జలాశాలు కూడా ఎండిపోతున్నాయి.

లోయర్ మానేరు డ్యామ్ లో నీటి మట్టం భారీగా తగ్గింది. అటు మిడ్ మానేరు లో కూడా నీరు తగ్గింది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీరు తగ్గుతోంది. అక్కడ నుంచి హైదరాబాద్ కు నీటిని తరలిస్తున్నారు. వచ్చే నెల నుంచి అత్యవసర పంపింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఇటు కృష్ణా బేసిన్ లోని నాగార్జున సాగర్ లో కూడా నీటి మట్టం పడిపోతోంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508.50 అడుగులుగా ఉంది.
ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ 510 అడుగులుగా ఉంది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ తక్కువగా నీరు ఉంది. సాగర్ నుంచే హైదరాబాద్ కు నీరు అందుతోంది. సాగర్ నీరు తగ్గితే భాగ్యనగరానికి నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలంలో ప్రాజెక్టులో కూడా నీరు క్రమంగా తగ్గుతోంది. జలాశయంలో 215 టీఎంసీలకు గానూ కేవలం 34 టీఎంసీలే ఉంది. జూన్ లేదా జులైలో వర్షాలు కురవకపోతే నీటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications