Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటల సమయం..

వరుసగా సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా వచ్చారు. నరసింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నరసింహ స్వామి ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం కొనసాగుతోంది.

అటు వేములవాడ, కొండగట్టులో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు నందకం రెస్ట్ హౌస్ దాటి బయట ఐదు కిలోమీటర్లకు పైగా బారులు తీరాయి.వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, ఎన్‌జీ షెడ్లు, బయట లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయం లోపల క్యూలైన్ నిర్వహణ, చప్పల్ స్టాండ్‌లు తదితర అన్నింటిలో దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులను వేర్వేరుగా నియమించారు.

The Yadadri Lakshminarasimhaswamy Temple continues to be crowded with devotees

భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పట్టింది. ఆదివారం కూడా భక్తుల రద్దీ ఉంది. స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. వరుసగా సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. స్వామివారి దర్శనానికి భారీగా సమయం పడుతుండడంతో భక్తులు తిరుమల యాత్ర ప్లాన్ రూపొందించుకోవాలని చెబుతున్నారు.

తమిళ ప్రజలకు ఈ పెరటాసి నెల చాలా పవిత్రమైనది, పెరటాసి నెల రెండో శనివారంతో పాటు ఆదివారం సెలవు, సోమవారం గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉండటంతో శుక్రవారం రాత్రే తమిళనాడులోని వివిద జిల్లాల నుంచి బయలుదేరిన శ్రీవారి భక్తులు శనివారం వేకువ జామున నుంచి తిరుమలకు వస్తున్నారు. రద్దీతో అక్టోబర్ 1, 7,8,14,15 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్టార్ టోకెన్లు రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+