వైన్ షాపులో మద్యం బాటిళ్ల చోరీ: ఇంటి దొంగ పనే
హైదరాబాద్: తాను పనిచేస్తున్న వైన్ షాపులో ఓ వ్యక్తి తన స్నేహితుడి సాయంతో చోరీకి పాల్పడ్డాడు. వారిద్దరు కలిసి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వైన్స్ షాపు తాళం పగులగొట్టి రూ.5 లక్షల విలువైన మ ద్యం బాటిళ్ళు దొంగిలించిన ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాదులోని మియాపూర్ బొల్లారం క్రాస్ రోడ్డులో ప్రియతమ్ గౌడ్‌కు చెందిన రోహిత్ వైన్స్‌లో ఓల్డ్ హఫీజ్‌పేట సాయినగర్‌కు చెందిన గంగాధర్(21) వర్కర్‌గా పనిచేసేవాడు.

శుక్రవారం రాత్రి తాళం వేసి ఇంటికి వెళ్లి శనివారం ఉదయం తిరిగి వచ్చేసరికి వైన్స్‌షాపు తాళం పగులగొట్టి లోపల ఉన్న మందుబాటిళ్ళను ఎత్తుకెళ్లినట్లు యజమాని గుర్తించాడు. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానం ఉన్న గంగాధర్‌ను విచారించగా నేరం అంగీకరించాడు.
బంజారహిల్స్ రోడ్డు నంబర్ 12కు చెందిన అక్షయ్(21) అనే ఆటో డ్రైవర్‌తో కలిసి గంగాధర్ వైన్స్ తాళం పగులగొట్టి అందులో ఉన్న రూ. 5లక్షల విలువైన మద్యం బాటిళ్ళను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించి వారి వద్ద నుంచి మద్యం బాటిళ్ళను స్వాధీ నం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications