Vijayashanthi: కాంగ్రెస్ పార్టీలోకి విజయశాంతి..!
మెదక్ మాజీ ఎంపీ, సీనియర్ సినీ నటి విజయశాంతి(Vijayashanthi) పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే బీజేపీలో ఆమెకు తగిన ప్రాధాన్యత తగ్గలేదు. ఆమెకు టికెట్ కూడా కేటాయించలేదు. అంతేకాకుండా ఆమెకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయశాంతి మొదటి నుంచి బీజేపీకి మద్దతుగానే నిలిచారు. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలోనే కాషాయానికి ఆకర్షితులయ్యారు. 1996లో తమిళనాడు ఎన్నికల్లో అన్నాడిఎంకేకు ప్రచారం చేశారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేశారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే.. విజయశాంతి కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ సోనియా బల్లారి నుంచి పోటి చేయడంతో విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఆ తర్వాత ఆమె బీజేపీలోనే కొనసాగారు. తెలంగాణ ఉద్యమమం కొనసాగుతోన్న వేళ తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో వీలినం చేశారు. ఆ తర్వాత 2009లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తో విభేదాల కారణంగా విజయశాంతి 2014లో కాంగ్రెస్ చేరారు. అప్పటి నుంచి ఆమె కేసీఆర్ పై పోరాటు చేస్తూ వస్తున్నారు. మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పని చేశారు.
విజయశాంతి 2019లో ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతుండడం.. బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్ పై పోరాటు చేసేందుకు కాషాయ పార్టీ సరైందని ఆ పార్టీలో చేరారు. అయితే ఆమెకు బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications