కుకునూర్ ఎస్ఐ ఆత్మహత్యలో ట్విస్ట్: బ్యూటీషీయన్ శిరీషతో అసభ్యంగా ప్రవర్తించాడా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. హైద్రాబాద్ లో ఫిలింనగర్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష కేసులో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి లింకులున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

బుదవారం ఉదయం వెలుగుచూసిన బ్యూటీషీయన్ శిరీషను ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి కొంతకాలంగా సన్నిహిత సంబంధాలున్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు.ఆదివారం నాడు రాజీవ్, శిరీష, తేజస్వినిలు కుకునూరు వెళ్ళారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

భర్తకు ఫోన్ చేసి రాత్రి లేట్‌గా వస్తానంది: బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

అయితే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో అసలు వాస్తవాలు బయటపెట్టాలని ఆయన కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట వారు ఆందోళనకు దిగారు.

కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య, రామకృష్ణారెడ్డి ఆత్మహత్యచేసుకొన్నచోటే, ఏం జరిగింది?

అయితే ఈ ఘటనపై డిజిపి సీరియస్ అయ్యారు. ఒకే పోలీస్ స్టేషన్ లో పదిమాసాల కాలంలోనే ఇద్దరు ఎస్ ఐ లు మరణించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించాలని అడిషనల్ డిజి గోపాలకృష్ణను ఆదేశించారు. ఈ విషయమై వాస్తవాలను తెలుసుకొనేందుకు ఆయన హుటాహుటిన కుకునూర్ కు బయలుదేరి వెళ్ళారు.

ప్రభాకర్ రెడ్డి కేసులో ట్విస్ట్

ప్రభాకర్ రెడ్డి కేసులో ట్విస్ట్

కుకునూర్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది.హైద్రాబాద్ కు చెందిన బ్యూటీషీయన్ శిరీష, తేజస్విని, రాజీవ్ లు కుకునూరు వెళ్ళారు. రాజీవ్ తో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి సంబంధాలున్నాయి.ఈ సంబంధాల నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి వారిని కుకునూరుకు ఆహ్వనించారు. ఈ ఆహ్వానం మేరకు వారు కుకునూరు వెళ్లారు. అయితే ఓ ఫాంహౌస్ లో పార్టీ చేసుకొన్న తర్వాత శిరీషతో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో శిరీష మనోవేదనకు గురై మంగళవారం నాడు రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకొంది. దీంతో ఈ విషయం వెలుగుచూస్తే పరువుపోతోందని ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల అదుపులో శ్రవణ్

పోలీసుల అదుపులో శ్రవణ్

అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. శ్రవణ్ ను ఈ కేసుకు సంబంధించిన పోలీసులు విచారిస్తున్నారు. అయితే శ్రవణ్ ను విచారించడం వల్లే ప్రభాకర్ రెడ్డి శీరీషపై అత్యాచారం ఆరోపణలు బయటకు వచ్చాయి.కొంతకాలంగా శిరీషతో ప్రభాకర్ రెడ్డి కారణంగా సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నాయి. రాజీవ్, శ్రవణ్ లను విచారిస్తున్నారు.

ఉన్నతాధికారుల వేధింపులే అంటున్న కుటుంబసభ్యులు

ఉన్నతాధికారుల వేధింపులే అంటున్న కుటుంబసభ్యులు

ప్రభాకర్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకొన్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు తమ కొడుకు లేవని ప్రభాకర్ రె్డ్డి తల్లి చెబుతున్నారు.

10 నెలల కాలంలోనే ఇద్దరు ఎస్ ఐ ల ఆత్మహత్య

10 నెలల కాలంలోనే ఇద్దరు ఎస్ ఐ ల ఆత్మహత్య

కుకునూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ ఐ లు పదిమాసాల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయారు. గత ఏడాది ఆగష్టు మాసంలో ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే రామకృష్ణారెడ్డి అనే ఎస్ ఐ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. బుదవారం ఉదయం ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీస్ బాస్ లు సీరియస్ గా తీసుకొన్నారు. అడిషనల్ డిజీ గోపాలకృష్ణ ను విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
there is a link with beautician sirisha suicide with kukunoor si prabhakar reddy suicide said police. Rajeev and sravan arrested in this case.
Please Wait while comments are loading...