జైలుకెళ్లొచ్చినా రేవంత్‌లో మార్పులేదు: యాదవరెడ్డి, కారెక్కమంటున్నారు: రాజేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, వెంకేటశ్వర్లు శుక్రవారం విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు వైపు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవుతుందన్నారు.
రాజేందర్ రెడ్డి ఆగ్రహం
నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు గతంలోనే అనుమతులు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వేరుగా చెప్పారు. 18 టీఎంసీల నీళ్లు తరలింపు వాటి లక్ష్యమని చెప్పారు. అధికార పార్టీలో చేరితే ఐదు రోజుల్లో అంతా చక్కబెడతామని చెబుతున్నారన్నారు.

కెసిఆర్‌తో డిఎస్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న డి శ్రీనివాస రావు భేటీ అయ్యారు.
మోడీ స్పందించడం లేదేం: వీహెచ్
2జి స్కాంపై ఊరూరా ప్రచారం చేసిన మోడీ వ్యాపం కుంభకోణంపై ఎందుకు స్పందించడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రాను ప్రశ్నించారు. హైదరాబాదులో చెత్త ఊడ్చాలని భజనపరులను కెసిఆర్, మోడీ ఆదేశించాలన్నారు.












Click it and Unblock the Notifications