పరిశుభ్రత అంశంలో రాజీ పడేదే లేదు.!మేయర్ జీడిమెట్ల సి&డి ప్లాంట్ పరిశీలన.!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్యానికి పెద్దయెత్తున ప్రాముఖ్యతనిస్తున్నారు నగర పాలక అధికారులు. అందులో బాగంగా నగరంలో ఎక్కడా కూడా చెత్త కనిపించకుండా ఉండేదుకు జీహెచ్ఎంసీ సిబ్బందిని రౌండ్ ద క్లాక్ రంగంలో దించుతోంది నగర పాలక సంస్ధ. ఇక వివిధ ప్రాంతాలనుండి సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ చేసేందుకు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. జీడిమెట్లలోని ప్రాసెసింగ్ యూనిట్ పనితీరును నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.

నిర్మాణ వ్యర్థాల తరలింపు.. సీ&డి యూనిట్ ను పరిశీలించిన మేయర్
జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మాణ వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్ కోసం మారో రెండు యూనిట్లను ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేసారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సి అండ్ డి ప్లాంట్ ను హెల్త్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరం మౌళిక సదుపాయాల్లో దూసుకుపోతున్నట్టే పచ్చదనం, పరిశుభ్రతలో కూడా ముందడుగు వేస్తోందని మేయర్ అన్నారు.

వ్యర్ధాల ప్రాసెసింగ్ .. మరో రెండు యూనిట్ల కోసం కృషి చేస్తానన్న మేయర్
నగరంలో నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటి కప్పుడు తొలగించుట,సేకరించిన వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేయుట కోసం నగరంలో జిహెచ్ఎంసి అధ్వర్యంలో జీడిమెట్ల, ఫతుల్లగూడలలో 2018న ఏర్పాటు చేసినట్లు, నగరంలో నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు మరో రెండు ప్రాసెసింగ్ యూనిట్లను సౌత్, నార్త్ వైపు ఏర్పాటుకు చేయనున్నట్లు మేయర్ అన్నారు. కేటాయించిన 15 సర్కిల్ లలో కాకుండా మిగితా సర్కిల్ లలో వ్యర్ధాలను తొలగించాలని మేయర్ ఆదేశించారు.

పచ్చదనం పరిశుభ్రతకు పెద్ద పీఠ.. పారిశుద్యం అంశంలో రాజీపడొద్దన్న మేయర్
మల్లాపూర్, కొత్వాల్ గూడలో ఏర్పాటుకు ముందుగా నిర్ణయించినట్లు స్థల సమస్య వలన ఏర్పాటు చేయలేదని, స్థలంతో పాటు నిర్వహణ కోసం టెండర్లను పిలుస్తున్నట్లు శానిటేషన్ హెల్త్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ వివరించారు. నిర్మాణ వ్యర్ధలను సకాలంలో తొలగించక పోవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని కర్వాన్ కార్పొరేటర్ మందాగిరి స్వామి అన్నారు. వ్వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన వాహనం సరైన పాయింట్ పోయే దారి ఉన్న వాహనాలు పోవడం లేదని రియసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బెగ్ కోరారు.

చెత్త తరలించేందుకు చిన్న వాహనాలు బెటర్.. పెద్ద వాహనాలతో సమస్యలన్న కార్పోరేటర్లు
చార్మినార్ వైపు సి అండ్ డి ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. చిన్నచిన్నగల్లీలలో ఉన్న వ్యర్ధాలను తొలగించేందుకు పెద్ద పెద్ద వాహనాలు పంపించడం వలన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చిన్న వాహనాలనే పంపించాలని కార్పొరేటర్లు కోరారు.ఈ కార్యక్రమంలో యస్.సి కోటేశ్వరరావు, కార్పొరేటర్లు సామల హేమ, సి.యస్ రెడ్డి, కుర్మా హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, మిర్జా ముస్తపా బేగ్ మొహమ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, విజయ్ కుమార్ గౌడ్, మందగిరి స్వామి, మందాడి శ్రీనివాస రావు , రషీద్ ఫరాజుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications