ఫ్రీ లెఫ్ట్ విడిచిపెట్టాలనే సోయి ఉండదు.!వీళ్లా శిక్షణపొందిన డ్రైవర్లు.?ఆర్టీసీ బస్సులపై ప్రజల అసహనం.!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరం వైపు పరుగులు పెడుతోంది. పరిశ్రమల స్థాపనలోగానీ, ఐటీ హబ్ లో గానీ, ప్రయివేట్ ఉద్యోగ, ఉపాది కల్పనలో గానీ, మౌళిక వసతుల సౌకర్యాలలోగానీ తనకు తనే సాటి, తనకు తానే పోటీ అంటోంది హైదరాబాద్ నగరం. ఇదే సమయంలో నగరంలో ఊహించని రీతిలో జనాబా పెరిగిపోయిన సందర్బాలు కూడా కనిపిస్తున్నాయి. కరోనా మొదటి, రెండో దశ కారణంగా జనం తాకిడి కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్లీ నగరం మొత్తం డంప్ అయిపోయారు జనం. దీంతో రహదారులు మల్లీ రద్దీగా మారిపోయాయి.

నియంత్రణ లేని డ్రైవర్లు..బస్సులను ఆపడంలో ఎంతో నిర్లక్ష్యం..
ప్రధానంగా కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. దీనికి తోడు క్రమశిక్షణగా బస్సులు నడుపుతూ, బస్ బే లలో మాత్రమే ఆపాల్సిన బస్సులను నడిరోడ్డుపై ఆపడం, ఫ్రీ లెప్ట్ విడిచిపెట్టాలనే సోయి లేకుండా బస్సులను ఆపేస్తుండడంతో మరింత ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసి డ్రైవర్లు నిబంధనలకు విరుద్దంగా బస్సులను ఆపడం, అతివేగం, హారన్ లో మోగిస్తూ శబ్దం చేస్తుండంతో నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న సందర్బాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆర్టీసి డ్రైవర్ల ఇష్టారాజ్యం.. ర్యాష్ డ్రైవింగే వారి లక్ష్యం..
దాదాపు నాలుగు వేల బస్సులు నగరంలో తిరుగుతుంటాయి. ఒక్కోసారి బస్సు వెనక బస్సు మొత్తం మూడు నాలుగు బస్సులు కదిలి వెళ్తుంటాయి. కొన్ని సందర్బాల్లో బస్సులను నడి రోడ్డుమీద ఆపేసి ప్రయాణీకులను దించడం, ఎక్కించుకోవడం చేస్తున్నారు డ్రైవర్లు. అంతే కాకుండా అవసరం లేకున్నా హారన్లు మోగిస్తూ అతివేగంగా బస్సులను నడిపిస్తుండడంతో ద్విచక్ర వాహన దారులు గానీ, పాదచారులుగానీ, కారులో వెళ్తున్న వారు గాని హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. నియంత్రణ లేకుండా, క్రమశిక్షణ ఏమాత్రం లేకుండా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ల తీరును పూర్తి స్దాయిలో వ్యతిరేకిస్తున్నారు నగర వాసులు.

ఫ్రీ లెఫ్ట్ ఒదలరు.. నిబంధనలను పాతరేస్తున్న ఆర్టీసి డ్రైవర్లు..
అన్నిటికన్నా అతిముఖ్యమైంది ఫ్రీ లెఫ్ట్ విడిచిపెట్టి బస్సులను నిలుపుదల చేయడం. కానీ నగరంలోని అనేక ప్రధాన కూడళ్ల దగ్గర ఫ్రీలెప్ట్ వదిలేసి బస్సులు ఆపాల్సి ఉంటుంది. కానీ నగరంలో ఆర్టీసి బస్సులు నడుపుతున్న ఏ ఒక్క డ్రైవర్ కు కూడా ఈ సోయి ఉన్నట్టు కనిపించదు. ఇష్టారాజ్యంగా ఫ్రీలెఫ్ట్ ను కవర్ చేసి, సైకిల్ దూరే సందులేకుండా కవర్ చేస్తూ ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నారు నగర ఆర్టీసి డ్రైవర్లు. అత్యంత రద్దీగా ఉండే హబ్సిగూడ చౌరస్తా, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చౌరస్తా, టోలి చౌకి, అత్తాపూర్, గచ్చిబౌలీ, మియాపూర్, లింగంపల్లి బీహెచ్ఈఎల్ చౌరస్తా ఇలా చాలా మార్గాల్లో అనేక చోట్ల ఫ్రీలెఫ్ట్ విడిచిపెట్టి బస్సులను ఆపడాన్ని డ్రైవర్లు మర్చిపోయిన సందర్బాలు కనిపిస్తున్నాయి.

తనిఖీలు ఎక్కడ.. నిద్రపోతున్న నిఘా విభాగం..
సాదారణంగా ఆర్టీసి బస్సులు నడిచే రూట్లలో రోడ్డు రవాణా సంస్ధ కొంత మంది ప్రతేక అధికారులను నిఘా విధులకోసం నియమిస్తుంటుంది. అధికారులు అకస్మాత్తుగా బస్సులోని పరిస్థితులను, టికెట్ వ్యవహారాన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ నిఘా వ్యవస్థ ఏమైపోయిందో అర్ధంకాని పరిస్తితులు నెలకొన్నాయి. బస్ బే లలో అదికారులు నిలబడి బస్సులను నియంత్రించడం ఇంతకు ముందు అక్కడక్కడా కనిపించేది. ఇప్పుడు ఆ వ్యవస్ధ ఏమైందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా ఉండే బస్సులను నడుపుతున్న డ్రైవర్లకు హద్దూ అదుపూ లేకుండా పోయి విచ్చలవిడిగా బస్సులను నడుపుతూ ట్రాఫిక్ సమస్యలకు కారణం అవ్వడమే కాకుండా కొన్ని సందర్బాల్లో ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు ఇలాంటి పరిణామాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications