ఎమ్మెల్యేల డిన్నర్ భేటీలో తప్పేంటి?
ఫిబ్రవరి నెలలో సూర్యపేట, మెదక్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బహిరంగ సభలకు అధిష్టానం నేతలను ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఢిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడంలో తప్పేమీ లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు.
సీఎల్పీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం తెలిపారన్నారు. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పేమీ లేదంటూ ఇటీవల పలువురు ఎమ్మెల్యే భేటీపై స్పందించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించినట్లు చెప్పారు. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నామని తెలిపారు. పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించినట్లు వివరించారు.
మెదక్, సూర్యపేటలో
— Congress for Telangana (@Congress4TS) February 6, 2025
కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు
🔸బీసీ కులగణన విజయవంతంపై సూర్యపేటలో రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా బహిరంగ సభ
🔹ఎస్సీ వర్గీకరణపై మెదక్ లో
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిధిగా బహిరంగ సభ
• @Bmaheshgoud6666 pic.twitter.com/GoSO4Q5iOC
రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు గంటన్నరపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications