నేను పార్టీ మారడం లేదు.. రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తా... రేవంత్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని మల్కజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఈనేపథ్యంలోనే రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పారు. ఇక ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కేసిఆర్ వ్యవహరించడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో ప్రశ్నించే వారు రాష్ట్ర్రంలో ఉండాలనే ఆలోచనతోనే ప్రజలు నన్ను గెలిపించారని చెప్పారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి కేంద్రంలో ఆపార్టీకి సరైన బలం లేకపోవడం బీజేపీలోకి జంప్ అవుతారనే ఉహాగానాలు వెలువడుతున్నాయి.దీనికి తోడు గతంలో కూడ బీజేపీ నాయకుడిగా పనిచేయడం రాష్ట్ర్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు లేకపోవడంతో పార్టీ మార్పుపై ఉహాగానాలు జోరందుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగిన రేవంత్‌రెడ్డికి సిపిఐ మద్దతు తెలిపింది. ఈనేపథ్యంలోనే ఆయనకు సిపిఐ పార్టీ కార్యాలయంలో రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. ఈసంధర్భంగా రేవంత్ మాట్లాడారు.












Click it and Unblock the Notifications