ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు తెలంగాణా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళే!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ప్రచార పర్వంలో దూకుడును పెంచడానికి బిజెపి కూడా రంగంలోకి దిగుతుంది. బిజెపి తరఫున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగించనుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచార వేడిని పెంచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా కీలక నాయకులను రంగంలోకి దింపి ప్రచారాన్ని కొనసాగించనున్నారు. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు బిజెపి తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యడియూరప్ప, కేంద్ర మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాద్వి నిరంజన్, జ్యోతి మురుగన్, ప్రకాష్ జవదేకర్, పురుషోత్తం రుపాల, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ సహా పలువురు జాతీయనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇక రాష్ట్ర నాయకులకు స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరికి స్థానం దక్కింది అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, రవి కిషన్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి, నరసయ్య గౌడ్, ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డిలు ఉన్నారు.
అనేతకాదు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, యాదవ్ కృష్ణ ప్రసాద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పురందేశ్వరి, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, జితేంద్ర రెడ్డి లకు స్థానం దక్కింది. బీజేపీ ప్రచార లిస్ట్‌లో విజయశాంతికి స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇక ప్రజా క్షేత్రంలో బీజేపీ నుండి స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications