ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే ప్రేమ, పెళ్లి.. దివ్యను వెంకటేశ్ హత్య చేయలేదు: తండ్రి పరశురాం
వెంకటేశ్ పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం లేదని తండ్రి పరశురాం తెలిపారు. అతనిని చూస్తే ఇతను హత్య చేశాడా..? అని మీరే ఆశ్చర్యపోతారని వెంకటేశ్ తండ్రి పేర్కొన్నారు. వెంకటేశ్ 99 శాతం దివ్యను హత్య చేసి ఉండడని, పోలీసుల విచారణకు సహకరిస్తామని స్పష్టంచేశారు. దివ్య-వెంకటేశ్ ప్రేమ-పెళ్లి నుంచి వీడిపోయేందుకు దారితీసిన పరిణామాలను మీడియా ప్రతినిధులకు పరశురాం వివరించారు

లొంగిపోయిన వెంకటేశ్
మరోవైపు దివ్యను హతమార్చిన వెంకటేశ్ వేములవాడ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. నిన్న దివ్యను హతమార్చిన తర్వాత పరారీలో ఉన్న వెంకటేశ్, బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయాడు. వెంకటేశ్-దివ్య ఇంజినీరింగ్ చేసే సమయంలోనే ప్రేమించుకున్నారని అతని తండ్రి పరశురాం పేర్కొన్నారు. ఆ సమయంలో కనిపించకుండా పోతే.. అమ్మాయి తల్లిదండ్రులు కేసు కూడా పెట్టారని గుర్తుచేశారు.

పెళ్లి అయ్యిందని చెప్పడంతో..
వేములవాడ పోలీసుస్టేషన్ వద్దకు సనత్ నగర్ పోలీసులతోపాటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చారని గుర్తుచేశారు. ఏం జరిగింది..? పెళ్లి అయిపోయిందా అనే ఆరాతీయగా.. అవునని చెప్పడంతో.. అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారని పరశురాం తెలిపారు. తర్వాత దివ్య తమతో ఉందని.. ఉస్మానియా వర్సిటీలో సీటు వస్తే తానే డబ్బులిచ్చి పంపించామని చెప్పారు. తమ కుమారుడు కూడా కోచింగ్ తీసుకుంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండేవాడని చెప్పారు. వాళ్లిద్దరూ ఏడాదిన్నర పాటు సజావుగానే ఉన్నారని.. అయితే దివ్య పేరెంట్స్ మాటలు కలవడంతో దూరం పెరిగిందని గుర్తుచేశారు.

భుజం మీద చెయ్యేసి ఫోటోలు..
ఏడాదిన్నర నుంచి దూరం ఉన్నా.. ఫోన్లలో మాట్లాడుకునే వారని పరశురాం చెప్పారు. గత ఆరు నెలల వరకు వారిద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. తనను వెంకటేశ్ వేధిస్తున్నారని దివ్య చెబితే.. ఫోన్లో ఉన్న ఫోటోలు, మాటలను చూసి ఎల్లారెడ్డి పేట పోలీసులే ఖంగుతిన్నారని చెప్పారు. అతను వేధిస్తే భుజం మీద ఫోటోలు దిగడం ఏంటీ..? అని పోలీసులు అడిగారని గుర్తుచేశారు. కానీ తర్వాత పోలీసులు తమ కుమారుడిని హెచ్చరించి, వదిలేశారని.. దివ్య జోలికి వెళ్లొద్దని చెప్పారని తెలిపారు.
Recommended Video


విచారణకు సహకరిస్తాం..
అమ్మాయి ఇష్టం లేదని చెబితే దూరంగా ఉండాలని పోలీసులు చెప్పారని.. దీంతో దూరంగానే ఉన్నాడని పేర్కొన్నారు. కానీ ఫోన్‌లో మాట్లాడేవారని తండ్రి పరశురాం గుర్తుచేశారు. తన కుమారుడు హత్య చేయడని, మా గల్లీ వారు కూడా నమ్మరని తెలిపారు. కానీ తాము పోలీసు విచారణకు సహకరిస్తామని పరశురాం తెలియజేశారు.












Click it and Unblock the Notifications