తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్ ప్రెస్; వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ!!
తెలంగాణా కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో తెలంగాణా రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలంగాణా రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది . ఈ నెల 24 వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
కాచిగూడ బెంగళూరు మధ్య ఈ రైలు తిరగనుంది. కాచిగూడ నుండి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తడుతరులు పాల్గొననున్నారు.మూడో వందేభారత్ రైలును ఆదివారం కాచిగూడ నుంచి బెంగళూరుకు జెండా ఊపి ప్రధాని ప్రారంభించనున్నారు.

ఇదే రోజు వివిధ ప్రాంతాల నుంచి 9 వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు బుధవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో సగటున గంటకు 71.74 కిలోమీటర్ల వేగంతో 8.30 గంటల్లో 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
వందే భారత్ రైలు కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలుకు మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, అనంతపూర్‌లో హాల్ట్‌లు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో రైలు యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
మొదటి రోజు వందేభారత్ రైలు కాచిగూడలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా తెలంగాణ నుంచి మూడో వన్డే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ వినాయక నవరాత్రుల కానుకగా చెబుతున్నారు.
ఈ రైలు మొత్తం 12 జిల్లాల మీదుగా వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్య సాయి జిల్లాలు, కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్ళాపూర్, బెంగళూరు మీదుగా ప్రయాణం చేయనుంది.












Click it and Unblock the Notifications