ఇది జూబ్లీహిల్స్‌లో ఓటర్ల అభిప్రాయం.. ఆ పార్టీకే గెలుపు
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఎంతో దూరంలో లేదు. సమయం దగ్గర పడుతోంది. 11వ తేదీన పోలింగ్ జరగనుండగా, 14 వ తేదీన ఫలితాలు వెలువడతాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో రోజుకో మీడయా సంస్థ సర్వే పేరుతో ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఒక మీడియా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతుంటే, మరో పార్టీ బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయి. దీంతో ఎవరి సర్వేను నమ్మాలో అర్థంకాక ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న హడావిడి మాత్రం లేదు. పోలింగ్ శాతం కూడా అత్యంత తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
మజ్లిస్ తరఫున రెండోస్థానంలో..
పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. అయితే తెలుగులోని కొన్ని ప్రధానమైన మీడియా సంస్థలు జూబ్లీహిల్స్ లో ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు అంతర్గతంగా సర్వే నిర్వహించాయి. ఈ సంస్థలు ఫలితాలను బయటకు ప్రకటించవుకానీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకే సర్వే సొంతంగా నిర్వహించుకుంటాయి. ఇక్కడి ఓటర్ల మనోగతం ప్రకారం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు ఉందని తేలుతోంది. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ తరఫున పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు మజ్లిస్ కోరిక మేరకే రేవంత్ నవీన్ ను ఎంపిక చేశారు.

రేవంత్, కేటీఆర్ ప్రచారాలు
సెటిలర్ల ఓట్ల కోసం మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటివ్వడం, మజ్లిస్ ఓటింగ్ కాంగ్రెస్ వైపు మళ్లిస్తానని అక్బరుద్దీన్ ఒవైసీ మాటివ్వడం, సహజంగా పడే కాంగ్రెస్ ఓట్లు కలుపుకొని ఆ పార్టీకే కొంత మొగ్గుందని తేలింది. అయితే మాగంటి సునీత.. తన భర్త మరణించడంతో పోటీచేయడం, అందుకు మహిళల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందని, హైదరాబాద్ ను రేవంత్ ఏమీ అభివృద్ధి చేయాలేకపోయాడంటూ కేటీఆర్ ప్రచారం చేయడంలాంటివి కలిసొస్తాయని భారత రాష్ట్ర సమతి భావిస్తోంది. చివరగా ప్రధాన మీడియా ఛానళ్లు చేసిన సర్వేలో కాంగ్రెస్ కే మొగ్గున్నట్లుగా తేలింది.












Click it and Unblock the Notifications