హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదీ బిర్యానీ పై తాలిబన్ ఎఫెక్ట్ : రుచిలో మార్పు- భారం కానుందా..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

హైదరాబాదీ బిర్యానీకి ఉన్న పేరు -క్రేజ్ వేరు. ప్రముఖులు ఎవరు హైదరాబాద్ వచ్చినా బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లరు. రాహుల్ గాంధీ-సచిన్..ఇలా ఎందరో హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయిన వారే. అయితే, ఇప్పుడు ఈ బిర్యానీ పైన అఫ్ఘన్ లో కొనసాగుతన్న పరిస్థితుల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అక్కడి అల్లకల్లోలం ఇక్కడి బార్యానీ వ్యాపారం మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుందని హోటల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా కస్టమర్ల మీద భారం పడే అవకాశం కనిపిస్తోంది.

బిర్యానీలో డ్రై ఫ్రూట్స్‌

బిర్యానీలో డ్రై ఫ్రూట్స్‌

హైదరాబాద్‌ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్‌ నిర్వహకులు. బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్‌లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్‌ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్‌, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

ఆఫ్ఘానిస్తాన్ నుంచి డ్రైఫ్రూట్స్

ఆఫ్ఘానిస్తాన్ నుంచి డ్రైఫ్రూట్స్


ఈ డ్రై ఫ్రూట్స్‌లో సింహభాగం ఆఫ్ఘానిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ అయిన జీడిపప్పు, కిస్మిస్‌ల వినియోగం కూడా ఉంటోంది. హైదరాబాద్‌లో బిర్యానీకి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కొందరు ఆఫ్ఘాన్ వ్యాపారులు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను ఆఫ్ఘాన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్‌ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

 ఆఫ్ఘాన్ వ్యాపారులతో తెగిన సంబంధాలు

ఆఫ్ఘాన్ వ్యాపారులతో తెగిన సంబంధాలు

అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు ఆఫ్ఘాన్లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్‌ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్‌ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు.

డ్రైఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు..

డ్రైఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు..

ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్‌ ఇబ్బందులు తప్పేలా లేవు. కోవిడ్‌ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్‌ కోలుకుంటుండగా ఆఫ్గన్‌ సంక్షోభం వచ్చిపడిందంటున్నారు హోటల్‌ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్‌ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కొందరు వ్యాపారులు అప్పుడే చెప్పేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు.

దీంతో..బిర్యానీ రుచులు-ఆ ఘుమఘుమలు తగ్గటం లేదా అవి కంటిన్యూ కావాలంటే ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా చెల్లించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

English summary
Afghanistan crisis may indirectly impact on Hyderabadi Biryani. It may caused for rate hike and change in taste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X