ప్రియుడి కోసం భర్తను, కూతుర్ని చంపిన ఈమె క్రిమినల్ మైండ్ క్రైం సినిమాల్లోనూ ఉండదు!

ప్రియుడి మోజులో పడి భర్తను, కన్నబిడ్డను హతమార్చింది ఓ ఇల్లాలు. మూడు నెలల వ్యవధిలో భర్తను, కన్న బిడ్డను హతమార్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.

అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం
ఆగస్టు 28వ తేదీన కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం రాగా సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు ఆ మృతదేహం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పుల వర్షిణి గా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

This woman who killed her husband and daughter for her lover wouldn t even be in a criminal mind crime movie

Take a Poll

విచారణలో విస్తుబోయే విషయాలు
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆమె తల్లి కవిత పైన అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా కేసులో దర్యాప్తు జరిపారు. ఈనెల రెండవ తేదీన తల్లి కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక విచారణలో వీరు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు.

పక్షవాతంతో మంచంలో భర్త.. ప్రియుడి మోజులో భార్య
కుమారస్వామి మొదటి భార్య చనిపోవడంతో మల్హర్ మండలం కొయ్యూరు కు చెందిన కవితను 24 ఏళ్ల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఇటీవల ప్రేమ వివాహం చేసుకోగా, పెద్ద కుమార్తె ఇంట్లోనే ఉంటుంది. కుమారస్వామి గత ఐదేళ్లుగా పక్షవాతంతో మంచం లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కవిత అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడి మోజులో పడింది.

గొంతు నులిమి భర్త హత్య, కూతురిని చంపాలని నిర్ణయం
ఇక ఈ విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించి తన ప్రియుడితో కలిసి జూన్ 25వ తేదీన పడుకుని ఉన్న కుమారస్వామిని గొంతు నులిమి హత్య చేశారు. ఆపై అతను అనారోగ్యంతో చనిపోయాడని చిత్రీకరించారు ఇక తల్లి తండ్రిని హత్య చేసిన విషయం కుమార్తె వర్షిణికి తెలియడంతో ఆమెని కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు

కుమార్తె వర్షిణిని చంపేసిన తల్లి, ఆమె ప్రియుడు
. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వర్షిణిని కవిత ఆమె ప్రియుడు రాజ్ కుమార్ ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. ఆపై మృతదేహాన్ని సంచిలో వేసి ఇంటి వెనకాల చెట్ల పొదల్లో దాచిపెట్టారు. ఆ తర్వాత గ్రామ శివారులోని పొదల్లో పడేశారు. ఇక మృతదేహం దుర్వాసన వస్తున్న క్రమంలో 25వ తేదీ కాటారం వైపుకు తీసుకెళ్ళి అడవిలో పడేసి వెళ్లారు.

క్షుద్ర పూజలు చేసినట్టు చిత్రీకరణ
పోలీసుల దృష్టి మరల్చడం కోసం అక్కడేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు ఆడవాళ్లు వదిలి వెళ్లారు. తల్లి పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా జంట హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు కోసం భర్తను, కన్నబిడ్డను దారుణంగా హతమార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+