హైద్రాబాద్‌పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్‌లో బాంబులు దాచారు

హైదరాబాద్: పాతబస్తీలో పట్టుబడిన ఐసిస్ సానుభూతిపరులను తమ కస్టడీకి ఇవ్వాలని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం నాడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని, అందుకోసం 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.

ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని గురువారమే కోర్టు ఎదుట హాజరుపరిచారు. కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి, ఈ రోజు వాదనలు వినిపించారు.

Those Arrested In Hyderabad Were Being Guided By ISIS: NIA

వీరి వెనుక ఎవరన్నారో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాగే, డబ్బులు, పేలుడు పదార్థాలు వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని, అందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టుకు విన్నవించారు.

వారి నుంచి మరింత సమాచారం సేకరించవలసి ఉందని చెప్పారు. వీరి నుంచి భారత్‌కు ముప్పు ఉందని చెప్పారు. దానికి, నిందితుల తరఫు లాయర్లు మాట్లాడుతూ.. రెండు రోజుల కస్టడీ చాలని కోర్టుకు విన్నవించారు.

కిచెన్‌లో పేలుడు పదార్థాలు

పట్టుబడిన ఐసిస్ సానుభూతిపరులు పేలుడు పదార్థాలను తమ తమ ఇళ్లలోని కిచెన్‌లో దాచి పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. వంట పాత్రలో కూడా పెట్టారు. యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను వారు వంట గదిలో పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+