Medaram: వాటే ఐడియా.. ఆన్ లైన్ లో మేడారం మొక్కుల చెల్లింపు..

గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారక్క జాతరకు మేడారం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జారతగా పేరున్న ఈ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలో ఏర్పాట్లను గిరిజన బిడ్డ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందకు తగ్గట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మేడారం అనగానే మనకు సమ్మక్క సారక్క గుర్తుకొస్తారు. సమ్మక్క-సారక్క అనగానే బంగారం(బెల్లం) గుర్తుకు వస్తుంది. ఈ జాతరకు వెళ్లే వారు దాదాపు అందరు నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిస్తారు. అయితే కొంత మంది జాతరకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం దేవాదాయ శాఖ ఆన్ లైన్ సేవులు ప్రవేశపెట్టారు.

Those who cannot go to the Medaram fair can pay their Mokkulu online

అక్కడికి వెళ్లలేని భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించవచ్చు. టీ యాప్ ఫోలియో, మీ సేవ, పోస్టాఫీస్ ద్వారా మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిలువెత్త బంగారం సమర్పించుకునే వారు ఎంత బరువు ఉన్నారో లెక్కించుకోవాలి. ఆ బరువుకు కిలో రూ.60 చొప్పున చెల్లించాలి.
ఉదాహరణకు మీరు మీరు 60 కిలోలు ఉంటే.. కిలోకు రూ.60 చొప్పున రూ.360 చెల్లించాలి. ఈ సర్వీస్ ను మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.

అంతే కాదు పోస్టాఫీస్ ద్వారా మేడారం ప్రసాదం పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. మేడారం వెళ్లి నిలువెత్తు బంగారం సమర్పించే వారు తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్లాలి. మీరు అక్కడ బెల్లం కొనుగోలు చేయాలంటే ఆధార్ జిరాక్స్ సమర్పించాలి. మేడారంలో బెల్లం కొనుగోలు చేసిన భక్తుల వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖా వ్యాపారులను ఆదేశించింది. దీంతో వ్యాపారులు బెల్లం కొనే వారి వద్ద ఆధార్ జిరాక్స్ తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+