భర్తను చంపిన స్వాతి: ఆమె నుంచే పిల్లలకు ప్రాణహని?
Recommended Video

నాగర్‌కర్నూల్: స్వాతి నుండి పిల్లలు వర్షిణి, దర్శిత్ రెడ్డిలకు ప్రాణహని ఉందని సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు బుదవారం నాడు ఎస్పీని కలిశారు.
నాగర్‌కర్నూల్ పట్టణంలో కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డిని ప్రియుడు రాజేష్‌తో కలిసి భార్య స్వాతి హత్య చేసింది.భర్త స్థానంలో రాజేష్‌ను తీసుకురావాలని ప్లాన్ చేసింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ వ్యవహరశైలితో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసులో మిస్టరీ వీడింది.
స్వాతి, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పూర్తి సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. తాజాగా రెండు రోజుల పాటు స్వాతిని కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు.

పిల్లలకు ప్రాణహని ఉంది
స్వాతి, సుధాకర్ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. వర్షిణి, దర్శిత్‌రెడ్డిలు. ప్రస్తుతం వీరిద్దరూ కూడ స్వాతి పుట్టింట్లోనే ఉంటున్నారు.ప్రియుడి కోసం స్వాతి పిల్లలను పుట్టింట్లోనే వదిలేసిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రైవసీ కోసమే ఇలా చేసిందని పోలీసులు తెలిపారు. మరో వైపు స్వాతితో పిల్లలు వర్షిణి, దర్శిత్ రెడ్డిలకు ప్రాణహని ఉందని సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

సుధాకర్ రెడ్డి హత్యతో వీధినపడ్డాం
సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధిన పడ్డామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి అంటూ భ్రమపడి రాజేష్ చికిత్స కోసం ఆసుపత్రి బిల్లులను కూడ చెల్లించి ఆర్థికంగా చితికిపోయామని వారు చెప్పారు.సుధాకర్‌రెడ్డిని హత్య చేసిన రాజేష్, స్వాతిలను కఠినంగా శిక్షించాలని వారు ఎస్పీని కోరారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం
నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులకు హమీ ఇచ్చారు.సుధాకర్‌రెడ్డి హత్యకు సంబంధించిన కేసులో సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు స్వాతిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. హత్య రోజు ఉపయోగించిన దుస్తులను స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ కేసు విచారణకు అవసరమైతే మరోసారి వీరిద్దరని పోలీస్ కస్టడీకి తీసుకోనే అవకాశం లేకపోలేదు.

పిల్లల సంరక్షణ ఎవరు తీసుకొంటారు
సుధాకర్ రెడ్డిని తన కూతురే హత్య చేసిందనే విషయాన్ని తెలుసుకొన్న స్వాతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్వాతికి కూడ కర్మకాండలను పూర్తి చేశారు. సుధాకర్ రెడ్డి చాలా మంచివాడని వారు చెబుతున్నారు. సుధాకర్ రెడ్డి గుర్తుగా పిల్లలను తాము పెంచుతామని ఇదివరకే ప్రకటించారు. అయితే స్వాతి జైలు నుండి బయటకు వస్తే స్వాతి ఎక్కడ ఉంటుంది. ఒకవేళ పుట్టింటికి వస్తే పిల్లలకు ప్రాణహని ఉంటుందని సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications