బోయినపల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు అరెస్ట్ .. 143 ఫోన్ కాల్స్ , కీలక విషయాలను వెల్లడించిన సీపీ
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లను, నకిలీ నంబర్ ప్లేట్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్ అఖిల ప్రియ వినియోగించిన సెల్ ఫోన్ నెంబర్ల వివరాలు వెల్లడించారు.
ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్

బోయినపల్లి సోదరుల కిడ్నాప్ లో భూమా భర్త .. కాల్ డేటా సేకరించిన పోలీసులు
పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కిడ్నాప్ జరిగినట్లుగా పేర్కొన్నారు. 6 సిమ్ కార్డులను మియాపూర్లోని మొబైల్ షాప్ లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి చెప్పారని సి పి వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించిన నిందితులు కిడ్నాప్ చేసిన వారిని ఉంచడం కోసం కూకట్ పల్లిలో నిందితులు ఒక హోటల్ రూమ్ కూడా తీసుకున్నారని, బోయినపల్లి సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పాత్ర కూడా ఉందని ఆయన వెల్లడించారు.

అఖిలప్రియ అనుచరుడు సంపత్ కుమార్ అరెస్ట్ .. కీలక ఆధారాల సేకరణ
ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు . విజయవాడ నుండి హైదరాబాద్ వరకు టవర్ లొకేషన్లను ప్రయత్నం చేశామని చెబుతున్నారు పోలీసులు. భూమా అఖిలప్రియ నెంబర్ నుండి గుంటూరు శ్రీను కు 49 కాల్స్ చేశారని ,గుంటూరు శ్రీను నుండి మరో నిందితుడికి మధ్య 28 కాల్స్, ఇంకో నిందితుడికి మధ్య 16 కాల్స్ కొనసాగాయని అంజనీ కుమార్ వెల్లడించారు.
భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కు నిందితులు టచ్లో ఉన్నారని సీపీ వెల్లడించారు.

కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్
కిడ్నాప్ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో శ్రీను మాట్లాడాడని కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్ ను పోలీసులు సేకరించినట్టు , ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. బెయిల్ కోసం అభ్యర్థించిన భూమా అఖిల ప్రియ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ప్రవీణ్ రావు ,సునీల్ రావు , నవీన్ రావు ల ఇంటికి ఐటీ దాడుల పేరుతో వెళ్లి హఫీజ్ పేటలోని ఒక భూ వివాదం లో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు అలెర్ట్ కావటంతో వారిని వదిలి వెళ్ళిపోయారు .