అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసింది వీరు ముగ్గురే (ఫొటో)
హైదరాబాద్: అక్కాచెల్లెళ్లను అపహరించిన ముగ్గురు యువకులను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని మాదన్నపేట పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంతోష్‌నగర్ ఎసిపి వి. శ్రీనివాసులు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మాదన్నపేట కుర్మగూడాకు చెందిన అక్కాచెల్లెళ్లను చాంద్రాయణగుట్ట జిఎం కాలనీకి చెందిన కారు డ్రైవర్ మహ్మద్ రహీం, సయ్యదా ఖాలిద్ ఈ నెల 15వ తేదీన మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకుని వెళ్లి అబ్దుల్ హమీద్ ఇంట్లో బంధించారు.

కూతుళ్ల ఆచూకీ తెలియకపోవడంతో వారి తండ్రి ఈ నెల 23వ తేదీన మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఆధారంగా కిడ్నాపర్ల ఆచూకి కనిపెట్టారు. హమీద్ ఇంటిపై దాడి చేసి బాలికలకు విముక్తి కలిగించారు. కిడ్నా చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు.
బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, నివేదిక ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామని ఎసిపి తెలిపారు. కాగా, బాలికలను ముంబైలో విక్రయించేందుకు నిందితులు ప్రయత్నాలు చేసినట్లు సమాచరాం. రెండు రోజుల్లో వారిని అక్కడికి తీసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎసిపి ఆ విషయాన్ని ధ్రువీకరించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications