Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బైక్‌లపై నుంచి దూసుకెళ్తూ ఇసుక లారీ బీభత్సం: ముగ్గురు మృతి

హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురం సుష్మా థియేటర్ చౌరస్తాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దాటి వాహనాలు వెళ్తున్న సమయంలో ఇసుక లారీ బైక్‌లపై నుంచి దూసుకెళ్లి ముగ్గురిని ప్రాణాలను బలి తీసుకుంది.

ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో బైక్‌పై వెళ్తుండగా ఆటోనగర్ నుంచి దూసుకెచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. అదే వేగంతో మరో బైక్‌పై నుంచి దూసుకెళ్లింది. క్షణాల్లో రోడ్డుపై నెత్తురు పారింది. శరీర భాగాలు ఛిద్రమై బాధితులు హాాకారాలు చేశారు.

Recommended Video

    లారీ బీభత్సం..ఇద్దరు మృతి.. భద్రాద్రిలో విషాదం..!
    జనాలు తలో దిక్కు పరుగు...

    జనాలు తలో దిక్కు పరుగు...

    లారీ తమపైకి దూసుకుస్తుందనే భయంతో ప్రజలు తలో దిక్కు పరుగులు తీశారు. లారీ ప్రమాదలో ఓ చిన్నారి సహా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

    వారు ఇలా వస్తుంండగా.

    వారు ఇలా వస్తుంండగా.

    నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పర్కాల గ్రామానికి చెందిన శ్రీరామోజు సునీల్ (30), రాధ దంపతులు తమ కుమారులు మహేష్ (7), మనీష్ (4)లతో కలిసి మీర్‌పేటలో ఉంటున్నారు. సునీల్ ఓ బంగారం దుకాణంలో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు వారంతా లిసి బైక్‌పై నల్లగొండ జిల్లా శ్రీనాథపురంలోని సునీల్ అత్తారంటికి వెళ్లారు.. తిరిగి వస్తుండగా బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సునీల్ కుమారుడు మహేష్ అక్కడికక్కడే మరణించాడు

    మరో వ్యక్తి బైక్ మీదికి...

    మరో వ్యక్తి బైక్ మీదికి...

    సునీల్ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ మరో బైక్‌పైకి దూసుకెళ్లింది దీంతో ఆ బైక్‌పై ఉన్న నరేష్ (20) యువకుడు మరణించాడు. ఇతను కొత్తపేటలోని బట్టలు దుకాణంలో పనిచేస్తున్నాడు. సునీల్‌కు, అతని చిన్నకుమారుడు మనీష్ స్వల్పంగా గాయపడ్డారు. లీ బీభత్సానికి రెండు బైక్‌లు సహా నాలుగు ఆటోలు ధ్వంసమయ్యాయి.

    డ్రైవర్ తాగి ఉన్నాడని..

    డ్రైవర్ తాగి ఉన్నాడని..

    ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయని కొందరు అంటుండగా డ్రైవర్ తాగి ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. బైక్‌పై వెళ్లవద్దని బంధువులు వారించినా సునీల్ వినలేదు. బస్సులో వెళ్తే ప్రమాదం తప్పేదని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+