కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బూట్లలో బంగారం పట్టివేత: రైలు నుంచి జారిపడి వైసిపి కార్యకర్త మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్రమంగా తీసుకువచ్చిన 3 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ అక్రమ బంగారాన్ని గుర్తించారు.

దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని బూట్లలో పెట్టుకుని ప్రయాణికులు తీసుకు రావడానికి ప్రయత్నించారు.

ఇదిలావుంటే, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పెద్దంపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Three kgs gold seized at Shamshabad international airport

మృతుడు ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త వినోద్‌కుమార్‌గా గుర్తించారు ఢిల్లీలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నా కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు పొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సిపిఎం నేత ఆత్మ్హహత్య

కుటుంబకలహాలతో సీపీఎం నేత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. లక్సెట్టిపేట మండలం గంపలపల్లిలో స్థానిక సీపీఎం నేత చింతా మల్లేష్‌ కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సీపీఎం కార్యకర్తలు ఆయన్ను కడసారి చూసేందుకు తరలివచ్చారు.

English summary
Three KGs gold has been seized from the Dubai passengers at Shamashababd international airport in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X