హైదరాబాద్ శివారులో కారు బీభత్సం.. ఆటో,బైక్‌లను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి...
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జాతీయ రహదారిపై అత్వెలి గ్రామ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆటోను ఢీ కొట్టింది. బైక్‌ను కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.మృతులను తూప్రాన్ మండల కేంద్రానికి చెందిన నీరజ లావణ్య , ఆమె కుమారుడు కౌశిక్,కొల్తూరు వాసి సుధీర్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వారం రోజుల క్రితం హైదరాబాద్ శివారులో మేడ్చల్ పరిధిలోని జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బౌరంపేట్ సమీపంలో ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైకు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతులను సూరారం ప్రాంతానికి చెందిన ప్రమోద్ రెడ్డి, సైనిరెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుల్తాన్ బజార్ సీఐ ఎస్. లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు.వీరు సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆగివున్న ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సీఐ భార్య కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.