• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DS & Sons సూపర్ పాలిటిక్స్ : తెలుగు రాజకీయాల్లో వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఇది తెలుగు రాజకీయాల్లో అరుదైన విషయం. సాధారణంగా మధ్యప్రదేశ్....ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చూసిన పరిస్థితులు ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కనిపిస్తోంది. తండ్రి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలో పెద్దగా ఉన్నారు. ఒక కుమారుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీలో ఎంపీ. ఇక, ఇప్పుడు మరో కుమారుడు కాంగ్రెస్ లో రీ ఎంట్రీ. ఆసక్తి కర ఈ సమీకరణం సీనియర్ పొలిటీషియన్ ధర్మపురి శ్రీనివాస్ అండ్ సన్స్ విషయంలో జరిగింది. తెలుగు రాజకీయాల్లో ఒకే కుటుంబలో రెండు పార్టీల్లో ఉన్న వారు ఉన్నారు. కానీ, ఇలా మూడు పార్టీల్లో ఉండటం మాత్రం ఇదే తొలి సారిగా చెబుతున్నారు.

 డీఎస్ కేంద్రంగా రాజకీయాలు..

డీఎస్ కేంద్రంగా రాజకీయాలు..

ధర్మపురి శ్రీనివాస్ కు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆయన కాంగ్రెస్ లో అంచెలంచలుగా ఎదిగి రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలోనే పీసీసీ చీఫ్ గా పని చేసారు. 1998, 2004 లో డీఎస్ ఏపీసీసీ అధ్యక్షడిగా వ్యవహరించారు. 2004 లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి వైఎస్ తో కలిసి పని చేసారు. వైఎస్ కేబినెట్ లో కీలకమైన శాఖకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ పదవి నుండి తప్పుకున్నా వైఎస్ కు సహకారం అందించారు. ఇక, 2014 తరువాత ఆయన రాజకీయాల్లో కొంత కాలం మౌనంగా ఉండిపోయారు.

 కేసీఆర్ కు నాడు సన్నిహితంగా..

కేసీఆర్ కు నాడు సన్నిహితంగా..

ఆ సమయంలో 2015 లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటుగా కుమారుడు సంజయ్ సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. తొలుత అంతరాష్ట్ర సలహాదారుడిగా నియమితులయ్యారు. రాజ్యసభ సీటు దక్కించు కున్నారు. తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు..ప్రధానంగా నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో ఆయన టీఆర్ఎస్ లో నే కొనసాగుతున్నా... యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక, చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరి అనూహ్యంగా 20919 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె..సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించారు.

 బీజేపీలో యాక్టివ్ గా అర్వింద్..

బీజేపీలో యాక్టివ్ గా అర్వింద్..

అప్పటి నుండి తెలంగాణ బీజేపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విజయంతో తండ్రి పెద్దల సభ రాజ్యసభ సభ్యుడిగా... చిన్న కుమారుడు లోక్ సభ సభ్యుడిగా గులాబీ..కాషాయం పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా ధర్మపురి సంజయ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన రాజకీయ భవిష్యత్ పైన చర్చించారు. రేవంత్ నుండి స్పష్టమైన హామీ రావటంతో కాంగ్రెస్ లో రీ ఎంట్రీకి సిద్దమయ్యారు. దీంతో..ఇప్పుడు ఒకే ఫ్యామిలీ..ముగ్గురు నేతలు..మూడు పార్టీలు..ఇదే అంశం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఆసక్తి కర చర్చకు కారణమైంది.

 ఒకే కుటుంబం..మూడు పార్టీలు..

ఒకే కుటుంబం..మూడు పార్టీలు..

అయితే, డీఎస్ తన రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తరువాత గులాబీ పార్టీలో ఎంత వరకు కొనసాగుతారనేది సందేహంగానే ఉంది. ఆయన పలు మార్లు ప్రత్యక్షంగా..పరోక్షంగా టీఆర్ఎస్ వ్యవహారాల పైన అసహనం వ్యక్తం చేసారు. కానీ, ఆయన పైన నేరుగా చర్యలకు మాత్రం గులాబీ బాస్ సిద్దంగా లేరు. తెలంగాణ వాదిగా.. సీనియర్ పొలిటిషీయన్ గా డీఎస్ కు ఉన్న గుర్తింపు కారణంగా ఆయన ప్రాధాన్యత కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు ఇద్దరు కుమారులు చెరో జాతీయ పార్టీలో ..తండ్రి ప్రాంతీయ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక, రానున్న రోజుల్లో ఈ ముగ్గురు కుటుంబంగా ఒక్కటిగా ఉన్నా...రాజకీయంగా ఒకే జిల్లా..ఒకే ప్రాంతానికి చెందిన నేతలుగా ఎటువంటి వైఖరితో కొనసాగుతారో అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Telangana senior politician Dharmapuri Sriniavas and his sons divided as Three men in three praties. Now this equation beacem hot topic in Telugu politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X