• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నగర ఆసుపత్రుల్లో మూడుపూటలా భోజనం.!రోగుల కోసం వినూత్న కార్యక్రమమన్న మంత్రి హరీష్ రావు.!

|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: హైద్రాబాద్ లోని 18 ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గొప్ప మానవతావాది అని, మానవత్వానికి మారు పేరని హరీష్ గుర్తు చేసారు. గతంలో రేషన్ బియ్యం మనిషికి నాలుగు కిలోలు చొప్పున ఇచ్చేవారని, కానీ 2014లో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఇవ్వమని ఆదేశించిన గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ రావు అని ప్రశంశల వర్షం కురిపించారు.

 కేసీఆర్ గొప్ప మానవతా వాది.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు

కేసీఆర్ గొప్ప మానవతా వాది.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు

ఎస్సి,ఎస్టి,బిసి హాస్టల్ లో గతంలో ముక్కిపోయిన ఆహారాన్ని కొలిచి పెట్టేవారని, అందుకు భిన్నంగా సన్న బియ్యంతో పిల్లలు తిన్నంత ఆహారం పెట్టాలని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశించారని అన్నారు. ఆసరా పెన్షన్ 200 నుంచి 2 వేలకు పెంచారని, దీంతో వృద్ధులు, వితంతువులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. దేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ అన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు వివిధ సందర్భాల్లో, కరోన సమయంలో గాంధీకి వెళ్ళినప్పుడు పేషెంట్ అటెండర్స్ బాధ చూశారని, వారికి 3 పూటలా ఆహారం అందించాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసారు.

 రోగి బందువులకు మూడుపూటలా భోజనం.. పధకాన్ని ప్రరంభించిన మంత్రి హరీష్ రావు

రోగి బందువులకు మూడుపూటలా భోజనం.. పధకాన్ని ప్రరంభించిన మంత్రి హరీష్ రావు

గ్రేటర్ పరిధిలోని 18 ఆసుపత్రుల్లో రోజు 20 వేల భోజనాలు అందిస్తారని అంచనా వేయడం జరిగిందని, ఇందుకోసం ప్రభుత్వం 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోందన్నారు. గ్రేటర్ లోని అన్ని నైట్ షెల్టర్లును కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు హరీష్ రావు. ఇటీవలే డైట్ ఛార్జీలను కూడా రెట్టింపు చేయడం జరిగిందని, ప్రభుత్వంపై 43 కోట్ల రూపాయలుకు పైగా భారం పడుతుందని, టెండర్లు కూడా చివరి దశలో ఉన్నాయన్నారు మంత్రి హరీష్ రావు. పారిశుద్ధ్యం కోసం ఒక్కో బెడ్ కు చెల్లించే మొత్తం 5000 నుంచి 7500 కు పెంచామని, ఏటా 338 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు మంత్రి హరీష్ రావు.

 ఉస్మానియాలో అభివృద్ది పనులకు హరీష్ శ్రీకారం.. 36కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్

ఉస్మానియాలో అభివృద్ది పనులకు హరీష్ శ్రీకారం.. 36కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్


అంతే కాకుండా 2679 కోట్ల రూయాలతో 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు శంకుస్థాపన చేశామన్నారు మంత్రి హరీష్ రావు. టిమ్స్, నిమ్స్ లో 2 వేల పడకలు ఏర్పాటుకి ఉత్తర్వులు త్వరలో రానున్నాయని, అల్వాల్ లో ఎమ్ సి హెచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ లోని అన్ని హాస్పిటల్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్ లో ఫైర్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం నిధులు కెటయించడం జరిగిందని, ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం 36 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను గురువారం మంత్రి హరీష్ ప్రారంభించారు.

 వారసత్వ కట్టడాన్ని కాపాడుతాం.. ఉస్మానియా కొత్త భవనం నిర్మిస్తామన్న మంత్రి హరీష్ రావు.

వారసత్వ కట్టడాన్ని కాపాడుతాం.. ఉస్మానియా కొత్త భవనం నిర్మిస్తామన్న మంత్రి హరీష్ రావు.


ఉస్మానియా పాత భవనం వివాదం నేపథ్యంలో వారసత్వ కట్టడాన్ని కాపాడుతూనే కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. కమిటీ ప్రాథమిక నివేదిక అందిందని, పూర్తి నివేదిక అందిన తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం ముందుగా విజిట్ చెసింది ఉస్మానియా ఆసుపత్రినేనని గుర్తు చేసారు. కొత్త భవన నిర్మాణానికి జీఓ కూడా అప్పుడే ఇచ్చారని, ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం రోగి సహాయకులకు మూడు పూటలా భోజన పథకం, ఆర్థోపెడిక్ అకాడమిక్ బ్లాక్, ఆపరేషన్ థియేటర్ లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజసింగ్, టి ఎస్ ఎమ్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
Health Minister Harish Rao said he was happy to launch a three-course meal program at 18 hospitals in Hyderabad. Harish reminded that Chief Minister Chandrasekhar Rao was a great humanist and a nickname for humanity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X