ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లోకి మూడు నెలల జీతం..
దేశానికి గ్రామాలే పట్టుగొమ్ములు అన్నట్లుగా గ్రామాల్లో నిత్యం తిరుగుతూ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లు. ఈ క్రమంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు నెలలకు సంబంధించి జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు భారీ ఉపశమనం కలిగించింది. మూడు నెలలకు సంబంధించి జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల మందికి పైగా మల్టీ పర్పస్ వర్కర్లకు భారీ ఊరట లభించింది.
గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు అనేకం. అలా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నమోదైన సమస్యలను పరిష్కరించే మల్టీ పర్పస్ వర్కర్లు మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ కార్మికుల సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల జీతం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు మంజూరు చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ నిధులు కార్మికుల అకౌంట్లలో జమ కానున్నాయి.

గ్రామ పంచాయతీ కింద పనిచేసే ఈ మల్టీ పర్పస్ వర్కర్లు గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా, పచ్చదనం పెంపుదల వంటి కీలక పనులను నిర్వర్తిస్తుంటారు.












Click it and Unblock the Notifications